మరొకవైపు రీల్స్ తో నేటిజన్స్ కూడా విపరీతమైన హైప్స్ క్రియేట్ చేయడం వల్ల పాటలకు, డైలాగులకు మంచి ఆదరణ లభిస్తోంది. కూర్చి మడత పెట్టే సాంగ్ యువతలో మంచి క్రేజీ సంపాదించుకోవడం జరిగింది. ఇప్పటికే ఈ పాటకి ఎంతోమంది రీల్స్ చేయడం కూడా జరిగింది.తాజాగా నేపాల్ లోని ఒక ప్రాంతంలో ఈ పాటకు మారు మోగేలా స్టెప్పులు వేశారు యువత. అందుకు సంబంధించి ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. అయితే ఈ వీడియో చూసిన చాలామంది మహేష్ అభిమానులు సినీ ప్రేమికులు సైతం వారెవ్వా అంటూ ప్రశంసిస్తూ ఉన్నారు.
ఇప్పటికే 550 మిలియన్ల వ్యూస్ వచ్చినట్లుగా మేకర్స్ సైతం ప్రకటించారు. తెలుగు సినిమా చరిత్రలోనే వేగంగా వ్యూస్ రాబట్టిన పాటలలో రికార్డు స్థాయిలో నిలిచినట్లు తెలుస్తోంది. అలాగే మూడు మిలియన్స్ పైగా లైక్స్ సాధించినట్లు గుంటూరు కారం సినిమా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కించగా శ్రీ లీల, మహేష్ బాబు జోడిగా నటించింది. ప్రస్తుతం రాజమౌళితో మహేష్ బాబు సినిమాని మొదలుపెట్టారు. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కించేలా ప్లాన్ చేస్తున్నారట.