నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన డాకూ మహారాజ్ సినిమా ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా ఇప్పటికే రు. 180 కోట్ల గ్రాస్ వసూళ్లు దాటసి రు. 200 కోట్ల వసూల్ల వైపు పరుగులు పెడుతోంది. సినిమా క్లీన్ హిట్ సినిమా గా నిలిచింది. డాకూ మహారాజ్ సినిమా రిలీజ్ అయ్యి 12 రోజులు అవుతోంది.. అప్పుడే 100 రోజులు ఎలా ఆడేసిందని అనుకుంటున్నారా ? అక్కడే ఉంది.. ట్విస్ట్.. బాలయ్య నటించిన సినిమాలు అన్నీ ఇటీవల కాలంలో ఎక్కడో ఓ చోట 100 రోజులు ఆడేస్తున్నాయి. మరీ ముఖ్యంగా రాయలసీమ లోని నంద్యాల లేదా ఎమ్మిగూరు లేదా మరో చోట ఇంకా చెప్పాలంటే పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట రామకృష్నా థియేటర్లో బాలయ్య సినిమాలు 100 రోజులు ఆడేస్తూ సెంచరీలు కొడుతున్నాయి.
బాలయ్య చివరి నాలుగు సినిమాలు చూస్తే అఖండ 4 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. వీరసింహారెడ్డి కూడా కర్నూలు జిల్లాలోని ఆలూరు - చిలకలూరిపేట లాంటి చోట్ల 100 రోజులు ఆడింది. భగవంత్ కేసరి సినిమా కూడా చిలకలూరిపేట రామకృష్ణా థియేటర్లో 100 రోజులు ఆడింది. ఇక డిక్టేటర్ సినిమా కూడా చీపురుపల్లిలో 100 రోజులు ఆడితే.. లయన్ కూడా చిలకలూరిపేట లోని రామకృష్ణాలో 100 రోజులు ఆడింది. శాతకర్ణి కర్నూలు జిల్లాతో పాటు విజయవాడలోనూ షిఫ్ట్ తో 100 రోజులు ఆడింది. అలాగే డాకూ మహారాజ్ సినిమా కూడా చిలకలూరిపేట లోనో లేదా రాయలసీమ లో ఎక్కడో ఓ చోట 100 రోజులు పక్కాగా ఆడడం గ్యారెంటీయే అని చెప్పాలి. ఇలా బాలయ్య సినిమా లు వరుస పెట్టి సెంచరీల మీద సెంచరీలు కొడుతూనే ఉంటాయి.