మన సినిమా ఇండస్ట్రీలో ఫ్లాప్ లేని దర్శకుల లిస్టులో రాజమౌళి, అనిల్ రావిపూడి వంటి దర్శకులు ఉన్నారు. కానీ ఆచార్య సినిమా రాకముందు వరకు కొరటాల శివ కూడా ప్లాప్ లేని డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. కానీ ఎప్పుడైతే ఆచార్య మూవీ వచ్చిందో తన సినీ కెరీర్ కి ఉన్న పేరు మొత్తం ఆ సినిమా రిజల్ట్ తో తుడిచిపెట్టుకు పోయిందని చెప్పుకోవచ్చు. ఇక గత ఏడాది వచ్చిన దేవర ఓకే టాక్ తెచ్చుకున్నప్పటికీ వావ్ అనేంతలా లేదు.ఈ విషయం పక్కన పెడితే.. కొరటాల శివ కెరియర్ ని మార్చేసిన మూవీ గా శ్రీమంతుడు మూవీని చెప్పుకోవచ్చు. 2015 ఆగస్టు 7న విడుదలైన శ్రీమంతుడు మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్టు కొట్టింది. ఈ సినిమాలో ఊరు మీద కోపంతో బయటికి వెళ్లిపోయిన జగపతి బాబు పెద్ద కోటీశ్వరుడు అవుతాడు. ఆ తర్వాత తన ఊరు ఏది? ఆ ఊరు దుస్థితి ఏంటో హీరోయిన్ ద్వారా తెలుసుకున్న మహేష్ బాబు సొంతూరికి వచ్చి దాన్ని దత్తత తీసుకొని ఊరికి కావలసినవన్ని అందిస్తాడు. 

అలా దత్తత తీసుకోవడం అనే కాన్సెప్ట్ తో వచ్చిన శ్రీమంతుడు మూవీ ఎంతో మంచి హిట్ కొట్టింది.ఈ సినిమాలో కేవలం ఎమోషనల్ సన్నివేశాలే కాదు మహేష్ బాబు ఇమేజ్ కి తగ్గట్టు యాక్షన్ సన్నివేశాలను కూడా చిత్రీకరించారు కొరటాల శివ. దాంతో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ కొట్టింది.అయితే ఈ సినిమా విడుదలకు ముందు బాహుబలి 1 మూవీ విడుదలైంది. ఇక ఈ మూవీ విడుదలయ్యాక 4 వారాల తర్వాత వచ్చిన శ్రీమంతుడు మూవీ కూడా బాహుబలి 1 మూవీకి పోటీగా నిలిచి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లు అందుకుంది. అంటే సినిమా ఎంత పెద్ద హిటో చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమా విడుదలయ్యాక చాలామంది సెలబ్రిటీలు సైతం తమకున్న డబ్బుతో ఊర్లను దత్తత తీసుకున్న సందర్భాలు మనం చూసాం.

అలా శ్రీమంతుడు మూవీ ఎంతోమంది సెలబ్రిటీలలో మార్పు తెచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమా ద్వారా కొరటాల శివ వివాదంలో కూడా ఇరుక్కున్నారు. ఎందుకంటే స్వాతి పత్రికలో వచ్చిన తన కథను కాపీ కొట్టారు అంటూ రచయిత కొరటాల శివ శ్రీమంతుడు పై కాపీరైట్స్ కేసు వేశాడు.అయితే ఈ ఇష్యూలో కొరటాల శివ ఎంత పోరాడినా కూడా ఫలితం దక్కలేదు. హైకోర్టు,సుప్రీంకోర్టు ఎక్కడైనా ఆ రచయిత వైపే తీర్పు ఇచ్చారు. దాంతో కాపీరైట్ ఇష్యులో కొరటాల శివపై క్రిమినల్ చర్యలు తీసుకోలేక తప్పలేదు. శ్రీమంతుడు మూవీ మాత్రమే కాదు ఆచార్య సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. కానీ ఆచార్య మూవీ ఫ్లాప్ అవ్వడంతో ఆ రచయిత కూడా సైలెంట్ అయిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: