అనిల్ రావిపూడి ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకు పోతోన్న దర్శకులలో ఒకరు. దర్శకధీరుడు అనిల్ రావిపూడి తర్వాత ఆ రేంజ్ లో నూటికి నూరు శాతం సక్సెస్‌లతో అనిల్ రావిపూడి దూసుకు పోతున్నారు. అనిల్ రావిపూడి ప్రస్థానం 2015 లో వచ్చిన కళ్యాణ్ రామ్ పటాస్ సినిమాతో స్టార్ట్ అయ్యింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన పటాస్ కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే అప్పటి వరకు అతి పెద్ద హిట్ సినిమాగా నిలిచింది. ఆ తర్వాత రాజా ది గ్రేట్ - సుప్రీమ్ - ఎఫ్ 2 - సరిలేరు నీకెవ్వరు - ఎఫ్ 3 - భగవంత్ కేసరి - సంక్రాంతికి వస్తున్నాం ఇలా వరుస పెట్టి ఒక దానిని మించిన సూపర్ హిట్ మరొకటి తీస్తూ అనిల్ దూసుకు పోతున్నాడు.
తాజాగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చి ఇప్పటికే రు. 230 కోట్ల గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టేసి.. రు. 300 కోట్ల వైపు పరుగులు పెడుతూ ఉండడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఇక అనిల్ రావిపూడి కి తొలి సినిమా పటాస్ ఛాన్స్ ఎలా వచ్చిందో తెలిస్తే ఆశ్చర్యపోతాం. అప్పటి వరకు అనిల్ మహేష్ బాబు ఆగడు సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు. పటాస్ స్టోరీ పట్టుకుని ముందుగా కళ్యాణ్ రామ్ దగ్గరకు వెళ్లాడు.. కథ విన్న కళ్యాణ్ రామ్ కథ చాలా బాగుంది.. నాకన్నా మరో పెద్ద స్టార్ హీరోతో చేస్తే ఇంకా పెద్ద హిట్ అవుతుందని చెప్పాడు.
ఆ టైంలో కళ్యాణ్ రామ్ ప్రొడ్యూస్ చేసిన ఓం డిజాస్టర్ కావడంతో కళ్యాణ్ రామ్ బయట నిర్మాతలకు సినిమాలు చేయాలా ? అన్న ఆలోచనకు కూడా వెళ్లాడట. ఈలోగా అనిల్ ఈ కథను పట్టుకుని కొందరు నిర్మాతల చుట్టూ తిరిగినా ఎవ్వరూ చేయలేదు. చివరకు అనిల్ మళ్లీ కళ్యాణ్ రామ్‌ను కలవడం.. కళ్యాణ్ ఈ సినిమా చేసి హిట్టు కొట్టడం జరిగిపోయాయి.