హనూ రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పనక్కర్లేదు.ఈ సినిమా కల్పిత కథ అయినప్పటికీ రియల్ స్టోరీలకు ఏమాత్రం తీసిపోని స్టోరీగా తిరకెకెక్కింది. ఆర్మీ సోల్జర్ ప్రిన్సెస్ మధ్య ప్రేమాయణాన్ని ఎంతో పర్ఫెక్ట్ గా తెరకెక్కించారు. వైజయంతి మూవీస్ సమర్పించిన సీతారామం సినిమాకి స్వప్న పతాకం పై అశ్విని దత్ నిర్మాతగా చేశారు.అలాంటి ప్రేమ కథ సినిమాలో దుల్కర్ సల్మాన్ మృణాల్ ఠాకూర్ లు హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీలో రష్మిక మందన్నా కీ రోల్ పోషించింది. అలాగే సుమంత్,భూమిక వంటి సీనియర్లు కూడా ఈ సినిమాలో నటించారు. అయితే ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన సీతారామం మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 

సినిమా చూసి థియేటర్ నుండి వచ్చిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కన్నీళ్లు పెట్టుకొని ఎమోషనల్ అయ్యి డైరెక్టర్ ను హగ్ చేసుకున్న వీడియోలు అప్పట్లో మనం చూసాం. ఎన్నో సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన హనూ రాఘవపూడి అందాల రాక్షసి మూవీతో డైరెక్టర్ గా మారారు. మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత కృష్ణ గాడి వీరప్రేమగాధ, లై, పడి పడి లేచే మనసు వంటి సినిమాలు కూడా హిట్ అయ్యాయి. ఆ తర్వాత వచ్చిన సీతారామం సినిమా మాత్రం హనూ రాఘవపూడి కెరీర్ లోనే ది బెస్ట్ మూవీ గా పేరు తెచ్చుకుంది.ఇక ఈ సినిమా హిట్ తో హనూ రాఘవపూడి ఏకంగా ప్రభాస్ నే లైన్ లో పెట్టేశారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమా అంటే మామూలు విషయం కాదు. కానీ ప్రభాస్ హనూ రాఘవపూడి సినిమాకి ఓకే చేశారంటే ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. హనూ రాఘవపూడి ప్రభాస్ కాంబినేషన్లో ఫౌజీ సినిమా వస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్గా కూడా కొత్త అమ్మాయిని తీసుకుంటున్నారు. ఇప్పటివరకు సినిమాల్లో అసలు అనుభవమే లేని ఇమాన్వి ఇస్మాయిల్ ని ఈ సినిమా కోసం హీరోయిన్ గా ఎంపిక చేశారు. అలా సీతారామం హిట్ తో హనూ రాఘవపూడి ఏకంగా ప్రభాస్ నే డైరెక్ట్ చేసే స్థాయికి వెళ్లారు

మరింత సమాచారం తెలుసుకోండి: