టాలీవుడ్ లో దర్శకుడు అనిల్ రావు ఇప్పుడు వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా 2015లో వచ్చిన పటాస్ సినిమాతో మెగా ఫోన్ పట్టిన అనిల్ రావి పూడి అప్పటినుంచి తాజాగా ఈ సంక్రాంతికి వచ్చిన వ్యక్తి వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా వరకు ఎనిమిది వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఇంత తక్కువ టైంలో 8 వరుస సూపర్ డూపర్ హిట్లు కొట్టడంతో టాలీవుడ్ లో ఒక్కసారిగా సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ అయిపోయారు అనిల్ రావిపూడి. రాజమౌళి లాంటి దర్శకులు కూడా అపజయం అన్నదే లేకుండా దూసుకుపోతున్నా కూడా .. రాజమౌళి భారీ బడ్జెట్ సినిమాలు పైగా రెండు మూడేళ్లకు గాని సినిమా చేయలేని పరిస్థితి. అనిల్ రావిపూడి దాదాపు ప్రతి ఏడాది ఒక సూపర్ డూపర్ హిట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
అనిల్ రావిపూడి బాలయ్యతో భగవంత్ కేసర్ లాంటి డిఫరెంట్ సినిమా తెరకెక్కించి హిట్ కొట్టారు. ఈ సినిమాలో యంగ్ క్రేజీ బ్యూటీ శ్రీలీల కూడా కీలక పాత్రలో నటించింది. ఈ సినిమా షూటింగ్ టైంలో శ్రీలీలకు - అనిల్ రావిపూడి కి మధ్య ఉన్న బంధుత్వం బయటపడింది. శ్రీ లీల కు అనిల్ వరుసకు మేనమామ అవుతారు. అనిల్ రావిపూడి స్వగ్రామం శ్రీలీల తల్లి గారి స్వగ్రామం ఒక్కటే. ప్రకాశం జిల్లాలో ని యుద్ధనపూడి మండలంలో ఈ విలేజ్ ఉంది. ఈ సినిమా షూటింగ్ టైంలో అనిల్ రావిపూడి ఊరి ప్రస్తావన వచ్చినప్పుడు .. శ్రీలీల మా అమ్మమ్మ గారిది అదే ఊరు అని చెప్పడంతో ఎవరు అని ఆరా తీయగా.. శ్రీలీల అనిల్‌కు వరుసకు మేనకోడలు అవుతుందన్న విషయం తెలిసిందట. అప్పటి నుంచి అనిల్‌ను శ్రీలీల మావయ్య అని పిలిచేదట.