రాంగోపాల్ వర్మ పైన నిన్నటి రోజు నుంచి ఒక విషయం వైరల్ గా మారుతున్నది.. వర్మ చెక్ బౌన్స్ కేసులో జైలు శిక్ష పడబోతుందనే విషయం వైరల్ గా మారడం జరిగింది. ఈ విషయం పైన తాజాగా రాంగోపాల్ వర్మ స్పందిస్తూ.. ఇది నా మాజీ ఉద్యోగికి సంబంధించిన ఏడు సంవత్సరాల క్రితం నాటి చెక్ బౌన్స్ కేసు అని తెలియజేశారు.. రూ.2.38 లక్షల రూపాయలు ఇవ్వాలని ఈ కేసులో ఇప్పటికే తన న్యాయవాదులు సైతం కోర్టుకి హాజరయ్యారని తెలిపారు. ఈ కేసు కోర్టులో ప్రస్తుతం ఉన్నందువలన తాను ఏమి చెప్పలేనని తెలిపారు వర్మ.


రాంగోపాల్ వర్మ ముంబైలో అందేరే కోర్టు మూడు నెలల పాటు జైలు శిక్ష చెక్ బౌన్స్ కేసులో విధించడానికి సిద్ధమయిందనే విధంగా వార్తలు వినిపించాయి. ఫిర్యాదు దారుడు మేరకు రూ.3.7 లక్షల పరిహారం చెల్లించాలి అంటూ కోర్టు కూడా ఆదేశాలను జారీ చేసింది అలా చేయని పక్షంలో మూడు నెలలు జైలు శిక్ష కూడా వర్మకి విధిస్తామంటూ హెచ్చరించింది మెజిస్టరేట్ కోర్టు.. 2018లో మహేష్ చంద్ర అనే వ్యక్తి రాంగోపాల్ వర్మ పైన ఈ చెక్ బౌన్స్ కేసు వేసినట్లు సమాచారం. అప్పటినుంచి ఇప్పటివరకు ఈ కేసు కొనసాగుతూనే ఉంది.


మరి ఈ విషయం పైన వర్మ కోర్టుకు వెళ్లి అక్కడ తన వాధలను వినిపిస్తారా..? లేకపోతే  తన మాజీ ఉద్యోగికి అడిగినంత డబ్బులు ఇస్తారా అన్న విషయం తెలియాల్సి ఉన్నది.. ప్రస్తుతం వర్మ సారీ అనే ఒక సినిమాని తన బ్యానర్ లోనే తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇదే కాకుండా మరొక భారీ మల్టీ స్టారర్ చిత్రాన్ని కూడా తెరకెక్కించే పనిలో పడ్డట్టుగా తెలుస్తోంది. ఇటీవలే వర్మ తెరకెక్కించిన సత్య  అనే సినిమాని రీ రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఇక మీదట తాను సినిమాల మీద ఫోకస్ చేస్తాననీ తెలియజేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: