ఇటీవల భారీ అంచనాల మధ్య గేమ్ ఛేంజర్ సినిమా విడుదలై అభిమానుల ఆశలను నిరాశగా మిగిలించింది నిర్మాతలను కూడా నట్టేట ముంచినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దిల్ రాజు బ్యానర్ పైన 50వ సినిమాగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఇది ఇతను చేసిన పెద్ద తప్పుగా వార్తలు వినిపిస్తున్నాయి. కథ నచ్చి రామ్ చరణ్ కూడా ఈ సినిమాని ఓకే చెప్పడంతో దిల్ రాజు కూడా ఈ సినిమాకి ఓకే చెప్పారట. కానీ మధ్యలో భారతీయుడు 2 చిత్రాన్ని పూర్తి చేయడానికి వెళ్లడంతో అటు ఆ సినిమా, గేమ్ ఛేంజర్ సినిమా రెండూ కూడా ఫ్లాప్ గా మిగిలిపోయాయి.
ముఖ్యంగా కాలం చెల్లిన కథ అని ప్రేక్షకులు కూడా థియేటర్ కి రావడం లేదు.. సుమారుగా 500 కోట్ల బడ్జెట్ తో ఎక్కించిన ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.ఈ సినిమా మొదటి రోజు 186 కోట్లు వచ్చిందని నిర్మాత ఒక పోస్టర్ వేయడంతో చాలా విమర్శలు కూడా వినిపించాయి. అయితే ఈ విషయంలో రామ్ చరణ్ కూడా ఇలా చేయవద్దండి అంటూ చెప్పారట. ఈ ఏడాది విడుదలైన అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ఈ సినిమానే ఉన్నది. మొదటిరోజు 51 కోట్ల రూపాయలను రాబట్టిందట. 13 రోజులకు గాను 128 కోట్లను రాబట్టిందట.. సంక్రాంతికి విడుదలైన డాకు మహారాజ్ ,సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు సక్సెస్ అయ్యి రామ్ చరణ్ సినిమా మీద దెబ్బేసింది. మొత్తానికి నిర్మాతలకు 370 కోట్లు నష్టాన్ని మిగిల్చిందట.