ఆఖరికి పూజా కార్యక్రమాలను కూడా ఎంత సైలెంట్ గా చేసేసారు అందరికీ తెలిసిందే. కాగా ఇప్పుడు రాజమౌళికి సంబంధించిన విషయం ఇంట్రెస్టింగ్ గా మారింది. అందరూ హీరోలు హీరోయిన్లు రాజమౌళి దర్శకత్వంలో నటించాలి అంటూ ఆశ పడతారు. అలాంటి ఛాన్స్ వస్తే ఎప్పుడు మిస్ చేసుకోరు . అయితే అలాంటి రాజమౌళి ఇండస్ట్రీలో ఓ హీరోయిన్ డాన్స్ అంటే చాలా ఇష్టం అట . ఇంకొంచెం బాగా చెప్పాలి అంటే పిచ్చి అని అంటున్నారు జనాలు. ఆమె మరి ఎవరో కాదు "శృతిహాసన్".
కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి వచ్చిన శృతిహాసన్ డాన్స్ చాలా చాలా బాగా చేస్తుంది . ఇరగదీసేస్తుంది . మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ తో నటించిన "రేసుగుర్రం" సినిమాలో "డౌన్ డౌన్ డుప్ప్"..చేసింది . అలాగే చాలా సినిమాలలో ఆమె డాన్స్ హైలెట్ గా మారింది . కానీ రాజమౌళికి బాగా నచ్చిన సాంగ్స్ రెండే రెండు అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకు వచ్చారు . "రేసుగుర్రం" సినిమాలోని "డౌన్ డౌన్ డుప్ప".. అదేవిధంగా "శ్రీమంతుడు" సినిమాలోని "చారుశీల".. ఈ రెండు సినిమాలలో ఆమె డాన్స్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది అని .. కొన్ని వందలసార్లు నేను ఈ పాటలను టీవీలో అదే విధంగా మొబైల్లో చూసాను అని చెప్పుకొచ్చారు . దీంతో సోషల్ మీడియాలో రాజమౌళి అదే విధంగా శృతిహాసన్ పేర్లు మారు మ్రోగిపోతున్నాయి . అంతేకాదు రాజమౌళికి అంత బాగా నచ్చేసిన ఈ హీరోయిన్ ని బహుసా ఫ్యూచర్ సినిమాలలో ఏమన్నా తన డైరెక్షన్లో నటింపచేస్తాడేమో..? చూద్దాం అంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారు జనాలు..!