అయితే రష్మిక, బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ తో నటించిన ఛావా సినిమా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాతో మరోసారి ఈ బ్యూటీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోనుంది. ఇప్పటికే ఈ సినిమా టైలర్ రిలీజ్ వేడుక ముంబాయిలో జరిగింది. కాలికి గాయం అయినప్పటికీ ఆ ఈవెంట్ కి రష్మిక వచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఛావా సినిమాలో శంభాజీ భార్య ఏసుబాయిగా నటించే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పుకొచ్చింది. ఒక నటిగా ఇంతకు మించి తనకి ఏం కావాలని.. ఈ సినిమా తర్వాత తాను సంతోషంగా రిటైర్ అయిపోతానని దర్శకుడితో ఒక సందర్భంలో తాను చెప్పినట్లు తెలిపింది. ఎందుకంటే ఈ సినిమాలో తనకు వచ్చిన పాత్ర అంత గొప్ప అని చెప్పింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎన్నో సార్లు తాను ఎమోషనల్ అయినట్లు తెలిపింది. ట్రైలర్ చూశాక కూడా తనకి అదే ఫీల్ కలిగిందని ఆమె చెప్పుకొచ్చింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. రష్మిక ఫాన్స్ అయితే చాలా హర్ట్ అవుతున్నారు.
ఇక రష్మిక మందన్న 2016లో కిరిక్ పార్టి అనే కన్నడ మూవీ ద్వారా నటిగా పరిచయమమైంది. ఈమెను అక్టోబరు 2024లో కేంద్ర ప్రభుత్వం హోంశాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C)కు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది.