ఫ్యాన్స్ కు భయపడి హీరోలపై ఐటీ దాడులు చేయడానికి నిర్మాతలు జంకుతున్నారనే చర్చ కూడ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. స్టార్ హీరోలను టార్గెట్ చేస్తే ప్రభుత్వాలపై కూడా వ్యతిరేకత వచ్చే ఛాన్స్ అయితే ఉంది. వాస్తవానికి చాలామంది స్టార్ హీరోలు తమ రెమ్యునరేషన్ ను బ్లాక్ లో తీసుకుంటారనే టాక్ ఉంది.
తీసుకునే పారితోషికంలో సగానికి సగం బ్లాక్ అని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. టాలీవుడ్ స్టార్ హీరోలు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండగా ఒక్కో సినిమాకు 100 నుంచి 200 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. టాలీవుడ్ స్టార్ హీరోలు ఇతర భాషల్లో సైతం క్రేజీ ప్రాజెక్ట్ లతో సత్తా చాటుతున్నారు.
టాలీవుడ్ స్టార్ హీరోలు నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలు నార్త్ ఇండియాలో సైతం సత్తా చాటుతున్నారు. చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, బన్నీ, పవన్, మహేష్ సోషల్ మీడియాలో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు. సరైన ప్రాజెక్ట్ లతో ముందుకొస్తే ఈ హీరోలు కొత్త రికార్డులు క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. టాలీవుడ్ ఇండస్ట్రీ స్టార్ హీరోలు బ్లాక్ మనీని ప్రోత్సహించకుండా ముందడుగులు వేస్తే బాగుంటుందని చెప్పవచ్చు.