ఈ సినిమాలో హీరోయిన్గా ప్రియాంక చోప్రా సెలెక్ట్ అయింది అని తాజాగా రామోజీ ఫిలిం సిటీ లో వీళ్ళిద్దరి మధ్యకి సంబంధించిన కొన్ని సీన్స్ షూట్ చేశారు అంటూ తెలుస్తుంది . ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన మరొక వార్త బాగా ట్రెండ్ అవుతుంది . మహేష్ బాబు సినిమా కోసం రాజమౌళి .. పవన్ కళ్యాణ్ సినిమాలోని సగం టైటిల్ తీసుకున్నారట . మనకు తెలిసిందే రాజమౌళి - మహేష్ బాబు సినిమా పై జనాలు ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో. అంతకు డబుల్ రేంజ్ లోనే జక్కన్న ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు.
కాగా రాజమౌళి.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి బిగ్ ఫ్యాన్. ఈ విషయాన్ని ఆయనే ఓ సారి చెప్పారు . అయితే పవన్ కళ్యాణ్ తో సినిమా తెరకెక్కించాలని చాలా చాలా ఆశపడ్డారట . కానీ అది కుదరలేదు . పవన్ కళ్యాణ్ నటించిన "కొమరం పులి" సినిమాలోని సినిమా టైటిల్ ని సగం మహేష్ బాబు టైటిల్ కి వాడబోతున్నారట. "కొమరం" అనే పదం వచ్చేలా సినిమా టైటిల్ ని స్టార్ట్ చేయబోతున్నారట . అంతేకాదు "కొమరం మాన్ ..కొమరం అటాక్ ..కొమరం పవర్ "..ఇలా రకరకాల టైటిల్స్ ను ఆలోచిస్తున్నారట . త్వరలోనే ఈ సినిమాకి మంచి టైటిల్ ని కన్ఫామ్ చేసి రిజిస్ట్రేషన్ కూడా చేయించబోతున్నారట . దీంతో కొంతమంది పవన్ కళ్యాణ్ అంటే అభిమానాన్ని ఇలా చూపిస్తున్నాడా రాజమౌళి అంటూ కూడా మాట్లాడుకుంటున్నారు..!