టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించాడు. ఇకపోతే ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలను అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా అల్లు అర్జున్ తన కెరీర్ లో రిజెక్ట్ చేసిన మూవీ లలో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్న సినిమాలేవో తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం నితిన్ హీరో గా సదా హీరోయిన్ గా తేజ దర్శకత్వం లో జయం అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదల ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమాలో మొదట తేజ అల్లు అర్జున్ ను హీరో గా అనుకున్నారు. ఆల్మోస్ట్ అంతా ఓకే అయ్యాక కొన్ని కారణాల వల్ల ఈ కాంబో మూవీ మిస్ అయింది. ఇక ఆ తర్వాత తేజ ఈ సినిమాను నితిన్ తో రూపొందించగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం మాస్ మహారాజా రవితేజ హీరో గా మీరా జాస్మిన్ హీరోయిన్గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో భద్ర అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో మొదట అల్లు అర్జున్ ను మేకర్స్ హీరోగా అనుకున్నారు. అందులో భాగంగా ఆయనను కలిసి కథను కూడా వివరించారు. కానీ ఆయన అప్పటికే ఆర్య సినిమాకు కమిట్ అయ్యి ఉండడంతో ఈ మూవీ చేయలేను అని చెప్పేసాడట. ఆ తర్వాత రవితేజ ను ఈ మూవీ లో హీరో గా సెలెక్ట్ చేసుకున్నారు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: