ఈ మధ్యకాలంలో అక్కినేని అమలా పేరు ని సోషల్ మీడియాలో జనాలు ఎలా ఏకి పారేశారో..బూతు పదాలతో ట్రోల్ చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . మరీ ముఖ్యంగా అమలపై ఎప్పుడు ఒక నెగిటివ్ వార్త ట్రోల్ అవుతూనే ఉంటుంది . అమల ..అఖిల్ ని ఒకలా.. సవతి బిడ్డ అయిన నాగచైతన్య ని ఒకలా ట్రీట్ చేస్తుంది అంటూ పదే పదే గుచ్చి గుచ్చి ట్రోల్ చేస్తూ ఉంటారు అంటూ కొందరు ఆకతాయిలు ట్రోల్ చేస్తూనే ఉంటారు. రీసెంట్గా అఖిల్ నిశ్చితార్థం చేసుకోవడం నాగచైతన్య పెళ్లి చేసుకోవడం రెండు జరిగాయి .


అయితే నాగచైతన్య నిశ్చితార్ధం పై ప్రేమపై పెళ్లిపై ఏ విధమైనటువంటి పోస్ట్ పెట్టని.. అమల - అఖిల్ నిశ్ఛితార్థం చేసుకుంటే మాత్రం ఇంటికి కాబోయే కోడలు అంటూ ఓ  రేంజ్ జైనబ్ రవ్జీ ని పొగిడేసింది. దీనికి సంబంధించిన పోస్ట్ బాగా ట్రెండ్ అయింది.. వైరల్ అయింది . అయితే ఇక్కడే అమల అడ్డంగా దొరికిపోయింది . సవతి తల్లి అని ప్రూవ్ చేశావు అని.. నాగ చైతన్యాన్ని ఎందుకు ఇలా టార్చర్ చేసి హింసిస్తున్నావు అంటూ రకరకాలుగా ఆమె పై మండి పడ్డారు నాగ చైతన్య అభిమనులు.



అయితే ఆ ట్రోలింగ్ నుంచి తప్పించుకోవడానికి ఇప్పుడు అక్కినేని అఖిల్ పెళ్లి బాధ్యతలు మొత్తం కూడా అక్కినేని నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల  పైన పెట్టేసిందట . ఈ ఇద్దరే ఇప్పుడు అక్కినేని అఖిల్ - జైనబ్ రవ్జీ ల పెళ్ళికి పెద్దలుగా మారబోతున్నారట . సోషల్ మీడియాలో తనపై జరిగే ట్రోలింగ్ ని తప్పించుకోవచ్చు అనే విధంగా తనపై ఎటువంటి నింద పడకుండా చేసుకుంటుంది అమల అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు.  దీంతో సోషల్ మీడియాలో మరొకసారి అమలా పేరు ట్రెండ్ అవుతుంది. కాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం మార్చి 24వ తేదీ అక్కినేని అఖిల్ అలాగే జైనబ్ రవ్జీల పెళ్లి దుబాయిలో ఘనంగా అంగరంగ వైభవంగా జరగబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: