తాజాగా ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనది మిర్యాలగూడ అని చెప్పాడు. అతను చిన్నప్పుడు సినిమాలలో నటించి సంపాదించిన డబ్బుతోనే వాళ్ల నాన్న ఇల్లు కట్టడాని తెలిపాడు. ఆయన బంగారం మూవీలో సౌందర్య ఎత్తుకునే చిన్న బాబును అతనేనని చెప్పుకొచ్చాడు. అలాగే అతను చివరగా చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన సినిమా ఎస్‌ఎమ్‌ఎస్ అని అన్నాడు. అయితే ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని అతను ఇంటికి వెళ్లేసరికే.. వాళ్ల అమ్మ, నాన్న, బామ్మ నిప్పంటించుకొని చనిపోయినట్లు చెప్తూ ఆయన ఎమోషనల్ అయ్యాడు.
ఆ తర్వాత రవిరాజ్ ని రాఘవ లారెన్స్ దత్తత తీసుకొని.. హాస్టల్ లో ఉంచి, పెద్ధ స్కూల్ లో చేర్పించాడు అంట. అయితే ఆయన తల్లిదండ్రులను కోల్పోవడంతో మద్యానికి బానిస అయినట్లు తెలిపాడు. మందు తగాకపోతే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయని.. ఏవేవో పిచ్చి జ్ఞాపకాలు గుర్తుకి వస్తాయని అందుకే ఒక్క రోజు కూడా తగకుండా ఉండలేనని చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పుడు ఇతను కెమెరా ముందు కాకుండా వెనక సెట్ లో పని చేస్తున్నడంట. ఓసారి రాజమౌళి రవిరాజ్ ని సెట్ లో చూసి.. చిన్నప్పుడు ఎంత బాగా నటించేవాడివి అని మెచ్చుకున్నాడు అంట. షూటింగ్ అయ్యాక వచ్చి కాలవమని కూడా చెప్పాడంట. కానీ రవిరాజ్ మాత్రం కావాలనే రాజమౌళి ని కాలవలేదని చెప్పుకొచ్చాడు.