టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఓ వైపు సినిమాలను నిర్మిస్తూ మరో వైపు సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తూ నిర్మాత గా , డిస్ట్రిబ్యూటర్ గా అద్భుతమైన జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న వారిలో దిల్ రాజు ఒకరు. ఈయన ఒకానొక ఇంటర్వ్యూ లో భాగంగా ఓ రెండు సినిమాల వల్ల భారీ మొత్తం లో నష్టపోయినట్లు చెప్పుకొచ్చాడు. ఆ సినిమాలేవి అసలేం జరిగింది అనే వివరాలను తెలుసుకుందాం.

ఒకానొక ఇంటర్వ్యూ లో భాగంగా దిల్ రాజు మాట్లాడుతూ ... 2017 వ సంవత్సరం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన స్పైడర్ మూవీ డిస్ట్రిబ్యూషన్ హక్కులను ఏకంగా 12 కోట్లకు కొనుగోలు చేశాను. భారీ అంచనాల నడవ విడుదల అయిన ఆ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేక పోయింది. ఆ సినిమా ద్వారా భారీ మొత్తంలో నష్టపోయాను. ఇక అదే సంవత్సరం పవన్ కళ్యాణ్ హీరో గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన అజ్ఞాతవాసి సినిమాను కూడా అత్యంత భారీ ధరకు కొనుగోలు చేశాను. ఆ మూవీ కూడా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు. దానితో ఆ సినిమా ద్వారా కూడా నాకు పెద్ద మొత్తంలో నష్టాలు వచ్చాయి.

ఇక 2017 వ సంవత్సరం మహేష్ బాబు , పవన్ కళ్యాణ్ హీరోలుగా రూపొందిన సినిమాల ద్వారా ఏకంగా 25 కోట్ల మేర నష్టం వచ్చింది అని దిల్ రాజు చెప్పుకొచ్చాడు. ఇకపోతే తాజాగా దిల్ రాజు , రామ్ చరణ్ హీరో గా గేమ్ చేంజర్ , వెంకటేష్ హీరో గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలను రూపొందించాడు. ఈ రెండు సినిమాలు ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యాయి. ఇందులో గేమ్స్ చేంజర్ మూవీ కి నెగిటివ్ టాక్ రాగా , సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: