ప్రతి సంవత్సరం తెలుగు సినిమా పరిశ్రమలోకి ఎంతో మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తున్నారు. అలా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తున్న ముద్దుగుమ్మల్లో ఈ మధ్య కాలంలో ఎంట్రీ ఇచ్చిన వారిలో మొదటి సినిమాతోనే చాలా తక్కువ మంది మంచి విజయాలను అందుకున్నారు. అలా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న బ్యూటీలు ఎవరో తెలుసుకుందాం.

కృతి శెట్టి : ఈ ముద్దు గుమ్మ ఉప్పెన అనే మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. పంజా వైష్ణవ్ తేజ్ హీరో గా రూపొందిన ఈ సినిమాకి బుచ్చిబాబు సన దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ తో కృతి శెట్టి కి తెలుగు సినిమా పరిశ్రమలో సూపర్ సాలిడ్ గుర్తింపు వచ్చింది.

సంయుక్త మీనన్ : ఈ బ్యూటీ పవన్ కళ్యాణ్ , దగ్గుపాటి రానా హీరోలుగా రూపొందిన భీమ్లా నాయక్ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ లో సంయుక్త మీనన్ , రానా కు భార్య పాత్రలో నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం , ఇందులో సంయుక్తా తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ ద్వారా ఈమెకు మంచి గుర్తింపు తెలుగు సినిమా పరిశ్రమలో వచ్చింది.

రష్మిక మందన : ఈ బ్యూటీ ఛలో అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. నాగ శౌర్య హీరో గా రూపొందిన ఈ మూవీ కి వెంకీ కుడుమల దర్శకత్వం వహించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడం , అలాగే రష్మికమూవీ లో తన నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టి పడేయడంతో ఈ మూవీ ద్వారా ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ గుర్తింపు వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: