పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్కువ శాతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమాలు చేయడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు . వీరిద్దరూ బయట కూడా మంచి స్నేహితు లు . ఎక్కడికి వెళ్లినా కూడా కలిసి వెళుతూ ఉంటారు . ఇకపోతే పవన్ కళ్యాణ్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో మొదటగా జల్సా అనే మూవీ వచ్చింది. ఈ సినిమా కంటే ముందు పవన్ కళ్యాణ్ వరుసగా అపజయాలను ఎదుర్కొంటూ వచ్చాడు . అలాంటి సమయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ , పవన్ కళ్యాణ్ తో రూపొందించిన జల్సా సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

మూవీ తర్వాత వీరి కాంబోలో అత్తారింటికి దారేది అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత వీరి కాంబోలో అజ్ఞాతవాసి అనే మూవీ వచ్చింది. అదిరిపోయే రేంజ్ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా మాత్రం బాక్సాక్ఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే పవన్ ప్రస్తుతం రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉండడం , ఇప్పటికే కమిట్ అయిన సినిమాలను కూడా కంప్లీట్ చేయకపోవడంతో ఇకపై పవన్ , త్రివిక్రమ్ కాంబోలో సినిమా వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి అని చాలా మంది అభిప్రాయపడ్డారు.

ఇకపోతే ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం పవన్ ప్రస్తుతం ఒప్పుకున్న సినిమాలను కంప్లీట్ చేసి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ప్రయత్నాలను చేస్తున్నట్లు , అందులో భాగంగా త్రివిక్రమ్ కూడా పవన్ కోసం ఓ కథను తయారు చేస్తున్నట్లు అన్ని కుదిరితే మరికొన్ని రోజుల్లోనే వీరి కాంబో మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: