ఒకప్పుడు యాంకరింగ్ రంగంలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారికి కూడా సినిమాల్లో పెద్దగా అవకాశాలు వచ్చేవి కాదు. కానీ ప్రస్తుతం యాంకరింగ్ రంగంలో మంచి గుర్తింపు వచ్చిన వారికి వరుసగా సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. దానితో సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి సరైన అవకాశాలు దక్కని వారు , మంచి గుర్తింపు రాని వారు యాంకరింగ్ రంగం వైపు ఆసక్తిని చూపిస్తున్నారు. అక్కడ మంచి సక్సెస్ అయితే సినిమాల్లో అవకాశాలు కూడా దక్కడంతో అనేక మంది బ్యూటీలు ఈ రూట్ ను ఎంచుకుంటున్నారు.

అందులో భాగంగా అనేక మంది బ్యూటీ లు ప్రస్తుతం ఓ వైపు టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరిస్తూనే , మరో వైపు వరస పెట్టి సినిమాల్లో నటిస్తున్నారు. అలా అద్భుతమైన స్థాయికి చేరుకున్న వారు మన తెలుగు లో కూడా ముగ్గురు ముద్దుగుమ్మలు ఉన్నారు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న అనసూయ ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంది. ఈమె ఓ వైపు యాంకరింగ్ రంగంతో బిజీగా ఉంటూ మరో వైపు సినిమాల్లో కూడా నటించింది.

ప్రస్తుతం ఈమె ఏకంగా పాన్ ఇండియా సినిమాల్లో కూడా నటిస్తోంది. ప్రస్తుతం కూడా ఈమె యాంకరింగ్ రంగంతో పాటు సినిమాల్లో కూడా బిజీగా ఉంటుంది. ఈమెతో పాటు జబర్దస్త్ లో యాంకర్ గా వ్యవహరించిన రేష్మి గౌతమ్ కూడా ఓ వైపు యాంకరింగ్ చేస్తూ మరో వైపు సినిమాల్లో నటిస్తూ బిజీగా కెరియర్ను ముందుకు సాధిస్తోంది. అలాగే శ్రీముఖి కూడా అనేక టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరిస్తూ చాలా సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా కెరియర్ను ముందుకు సాగిస్తుంది. ఈ ముగ్గురు ముద్దు గుమ్మలు అనేక సినిమాల్లో తమ అందాలతో ప్రేక్షకులను కట్టి పడేసిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: