సినిమా ఇండస్ట్రీ లోకి ఎంతో మంది హీరోయిన్లు ప్రతి సంవత్సరం ఎంట్రీ ఇస్తూ ఉంటారు . కానీ వారిలో చాలా తక్కువ మంది మాత్రమే తక్కు వ సమయంలో స్టార్ హీరోయిన్స్ స్థానానికి చేరుకుంటూ ఉంటారు . అలా చేరుకున్న తర్వాత కూడా అలా కెరీర్ను మరి తక్కువ మంది మాత్రమే కొనసాగిస్తూ ఉంటారు. ఇక పైన ఫోటోలో ఓ చిన్న పాప ఉంది కదా ఆమె ఎవరో గుర్తుపట్టారా ..? ఆమె అనేక తెలుగు , తమిళ్ సినిమాలలో నటించి రెండు ఇండస్ట్రీ లలో కూడా స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకోవడం మాత్రమే కాకుండా ఇప్పటికి కూడా అదే రేంజ్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తుంది.

ఈమె వయసు ఇప్పటికే 40 లోకి చేరుకుంది. అయినా కూడా వరుస సినిమాలలో అవకాశాలను దక్కించుకుంటుంది. అలాగే తన నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టి పడేస్తూ వస్తుంది. ఇంతకు పైన ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా ..? ఆమె మరెవరో కాదు మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని త్రిష. త్రిష ఎంతో మంది టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో సంవత్సరాల పాటు అద్భుతమైన గుర్తింపు కలిగిన హీరోయిన్ గా తెలుగు లో కెరీర్ నీ కొనసాగించింది.

అలాగే తమిళ్ లో కూడా ఈమె అద్భుతమైన స్థాయిలో కెరీర్ ను కొనసాగించింది. ప్రస్తుతం కూడా ఈమె వరస పెట్టి తెలుగు , తమిళ్ సినిమాల్లో నటిస్తుంది. ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగు లో చిరంజీవి హీరో గా రూపొందుతున్న విశ్వంభర అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ ని మరి కొంత కాలం లోనే విడుదల చేయనున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: