నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా 'తండేల్'పై అందరిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. చందూ మొండేటి డైరెక్ట్ చేసిన ఈ సినిమా లవ్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో అలరించనుంది. 2025, ఫిబ్రవరి 7న థియేటర్లలో సందడి చేయనుంది.

ఇటీవల జరిగిన ఈ సినిమా ప్రమోషన్ ఈవెంట్లో నిర్మాత అల్లు అరవింద్ అదిరిపోయే కామెంట్స్ చేశారు. సినిమాపై ఫుల్ కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశారు. నాగ చైతన్య కెరీర్ లోనే ఇది బెస్ట్ సినిమా అవుతుందని, కలెక్షన్ల పరంగా కూడా రికార్డులు కొడుతుందని జోస్యం చెప్పారు. "తండేల్ లో చైతన్య కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇది కచ్చితంగా తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుంది" అని ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్పుకొచ్చారు.

అంతేకాదు, ఈ ఈవెంట్లో అల్లు అరవింద్ అందరికీ షాక్ ఇచ్చారు. 'హైలెస్సో.. హైలస్సా' అనే మూడో పాట రిలీజ్ చేస్తూ స్టేజ్ మీదే డ్యాన్స్ చేశారు. అసలే అరవింద్ డ్యాన్స్ చేయడం చాలా అరుదు. అలాంటిది ఆయన డ్యాన్స్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇంతకుముందు 'ప్రతిరోజూ పండగే' సినిమా టైమ్ లో కూడా ఇలాగే డ్యాన్స్ చేశారు, ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు తండేల్ కూడా అదే దారిలో వెళ్తుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందేమో చూడాలి.

ఇక సినిమా కథ విషయానికొస్తే, ఇది నిజంగా జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. పాక్‌ జలాల్లోకి పొరపాటున వెళ్లిన ఓ మత్స్యకారుడి కథ ఇది. ఈ సినిమా కోసం ఏకంగా రూ.75 కోట్లు ఖర్చు పెట్టారు. చైతన్య కెరీర్ లోనే ఇది భారీ బడ్జెట్ మూవీ కాగా ఒక పాట కోసం ఏకంగా రూ.4 కోట్లు ఖర్చు చేసి 900 మంది డ్యాన్సర్లతో గ్రాండ్ గా షూట్ చేశారంట.

దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా పాటలు ఇప్పటికే దుమ్మురేపుతున్నాయి. సినిమా డిజిటల్, శాటిలైట్ హక్కులు కూడా మంచి రేటుకి అమ్ముడుపోయాయట. మొత్తానికి తండేల్ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఫ్యాన్స్ అయితే ఫిబ్రవరి 7 కోసం బాగా వెయిట్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: