రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ మూవీ మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కినా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే విషయంలో ఫెయిలైంది. ఈ సినిమాకు ఇప్పటివరకు 100 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లు వచ్చాయి. ఏపీలోని పలు ప్రాంతాలలో రామ్ చరణ్ అభిమానులు గేమ్ ఛేంజర్ సినిమాను ఉచితంగా చూపిస్తున్నారు. ఐఏఎస్ అధికారి కథ కావడంతో ఉచితంగా సినిమాను చూపించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.
 
రాజోలులో ఉన్న మెగా ఫ్యాన్స్ 70 మంది స్టూడెంట్స్ కు గేమ్ ఛేంజర్ బెనిఫిట్ షో డబ్బులను పుస్తకాల పంపిణీ కోసం ఉపయోగించారు. ఈ విషయంలో రామ్ చరణ్ అభిమానులను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. గేమ్ ఛేంజర్ ఫుల్ రన్ లో 110 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకునే అవకాశం అయితే ఉందని సమాచారం అందుతోంది.
 
గేమ్ ఛేంజర్ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా చరణ్ కియారా కాంబినేషన్ సూపర్ కాంబినేషన్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. గేమ్ ఛేంజర్ సినిమా వల్ల దిల్ రాజుకు ఊహించని స్థాయిలో నష్టాలు వచ్చాయని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం. గేమ్ ఛేంజర్ సినిమా ఇతర భాషల్లో ఆశించిన రిజల్ట్ అందుకోలేదు.
 
తమిళనాడులో, బాలీవుడ్ ఇండస్ట్రీలో గేమ్ ఛేంజర్ సినిమా భారీ నష్టాలను మిగిల్చింది. గేమ్ ఛేంజర్ మూవీ గతంలో దిల్ రాజుకు ఏ సినిమా మిగల్చని స్థాయిలో నష్టాలను ఈ సినిమా మిగిల్చింది. సంక్రాంతికి వస్తున్నాం మూవీ హిట్ కావడంతో దిల్ రాజుకు నష్టాలు తగ్గాయని చెప్పవచ్చు. భవిష్యత్తు సినిమాల విషయంలో దిల్ రాజు ఒకింత జాగ్రత్త వహించాల్సి ఉంది. రామ్ చరణ్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 70 నుంచి 80 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.




మరింత సమాచారం తెలుసుకోండి: