మహేష్ బాబు కెరియర్ లో ఎన్నో సినిమాలో నటించాడు . కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. సినిమాలు హిట్ అయినప్పుడు ఆనందపడ్డడు ..ఫ్లాప్ అయినప్పుడు బాధపడ్డడు . కానీ ఒక సినిమా ఫ్లాప్ అయినా సరే ఏ మాత్రం బాధపడలేదు డిసప్పాయింట్ అవ్వలేదు.. హ్యాపీగా ఫీల్ అయ్యాడు . ఆ సినిమా ఇచ్చిన ఎనర్జీ ఆయనకు అంత బూస్ట్ అప్ తెప్పించింది.  ఆ సినిమా మరేదో కాదు "నిజం". మహేష్ బాబు కెరియర్లో ఫ్లాప్ సినిమాలను లెక్క పెట్టుకోవాల్సి వస్తే మొదటి స్థానంలో ఈ మూవీనే ఉంటుంది .


మహేష్ బాబు అభిమానులకి ఈ సినిమా అస్సలు నచ్చలేదు . మహేష్ బాబు యాక్టింగ్ ఆయన లుక్స్ .. ఫ్యాన్స్ ని తీవ్రంగా డిసప్పాయింట్ చేశాయి . అయితే మహేష్ బాబుకు మాత్రమే సినిమా బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఫీలింగ్ కలుగజేసింది అంట . "నిజం" సినిమాలో చాలా డిఫరెంట్ గా కనిపిస్తాడు మహేష్ బాబు . అంతేకాదు ఆయన కెరియర్లో మేకప్ చేసుకోకుండా చేసిన ఏకైక సినిమా కూడా ఇదే కావడం గమనార్హం. కాగా మహేష్ బాబు ఈ సినిమా కోసం గుండు కొట్టించుకోవాల్సి ఉండిందట. డైరెక్టర్ తేజ ఓ సీన్లో భాగంగా తండ్రి చనిపోయిన తర్వాత మహేష్ బాబు గుండు కొట్టించుకోవాలి అంటూ చెప్పారట . కానీ ఆ టైంలో సూపర్ స్టార్ కృష్ణ అస్సలు ఒప్పుకోలేదట .



"వాట్ మహేష్  గుండు కొట్టించుకోవడమా.. ఈ సినిమా కోసం గుండు కొట్టించుకుంటే నెక్స్ట్ సినిమాల పరిస్థితి ఏంటి? మహేష్ బాబు లుక్స్ అందం అంతా కూడా ఆయన హెయిర్ లోనే ఉంది .. నో వే సినిమానైనా వదులుకుంటాడు ఏమో కానీ గుండు మాత్రం కొట్టించుకోకూడదు" అంటూ తెగేసి చెప్పేసాడట . ఆ కారణంగా మహేష్ బాబు ఈ సినిమా కోసం గుండు కొట్టించుకోకుండా నార్మల్గానే సినిమా షూట్ ను కంప్లీట్ చేశారట.  గుండు కొట్టించుకోకుండా మంచి పని చేశాడు. ఈ సినిమా అట్టర్ ప్లాప్ అయింది అంటూ అప్పట్లో జనాలు బాగా ఆడేసుకున్నారు. ప్రజెంట్ మహేష్ బాబు రేంజ్ ఏ లెవెల్ లో మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు . మహేష్ బాబు ప్రెసెంట్ పాన్  ఇండియా డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు . ఈ సినిమా హిట్ తర్వాత మహేష్ బాబు పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు..!

మరింత సమాచారం తెలుసుకోండి: