నయనతార.. ఈ పేరు చెప్తే ఇప్పటికీ షట్స్ చించుకుని.. అరుపులు కేకలతో రచ్చ రంబోలా చేసే కుర్రాళ్ళు ఉన్నారు అని చెప్పడంలో సందేహమే లేదు. నయనతారకు ఎప్పుడు కూడా ఒక సెక్షన్ ఆఫ్ అభిమానులు లైక్ చేస్తూనే ఉంటారు . మరీ ముఖ్యంగా అందులో అంకుల్స్ కూడా ఉండడం గమనార్హం.  సాధారణంగా నయనతారను ట్రెడిషనల్ లుక్స్ లోఅమ్మాయిలు మాత్రమే లైక్ చేస్తారు.  కానీ చక్కగా చీర కట్టుకొని లేడి ఓరియంటెడ్ పాత్రలో నటించేటప్పుడు మాత్రం పెళ్లైన హీరోలు కూడా నయనతారని ఎక్కువగా లైక్ చేస్తూ ఆమెను సపోర్ట్ చేస్తూ ఉంటారు.


 కాగా పెళ్లి తర్వాత ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ కి గురైంది నయనతార . దానికి సంబంధించిన  అన్నీ విషయాలు కూడా మనకు తెలిసినవే.  అయితే అవి ఎక్కడ కూడా తన కెరియర్ కి మైనస్ కాకుండా ఒక్కొక్క స్టెప్ ముందుకు వేస్తూ మళ్ళీ తన పేరుకి పునర్ వైభవం అందించుకునే విధంగా నయనతార ముందుకు వెళుతుంది . ఇలాంటి మూమెంట్లోనే నయనతారకు ఒక తెలుగు హీరోకి అస్సలు పడని మేటర్ బయటపడింది . ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సార్లు ఆమెతో నటించే ఆఫర్ వచ్చినా సరే బడా స్టార్ హీరో ఆ సినిమాను ఓకే చేసి అందులో హీరోయిన్ మాత్రం నయనతార వద్దు అంటూ ఆమెని రిజెక్ట్ చేశారట.



ఆయన మరెవరో కాదు మహేష్ బాబు.  "పోకిరి" సినిమా టైంలో ఇలియానా ప్లేస్ లో నిజానికి నయనతార నటించాల్సి ఉంది. కానీ మహేష్ బాబు నయనతార ప్రమోషన్స్ కి రాదు .. అందుకే హెడ్ వెయిట్ ఎక్కువ అన్నట్లు ఈ ఆఫర్ ని ఆమెకు వెళ్ళనీకుండా చేశారట . ఆ తర్వాత "సరిలేరు నీకెవ్వరు" సినిమా టైంలోనూ అదే న్యూస్ బాగా ట్రెండ్ అయింది . అంతేకాదు మహేష్ బాబు నటించిన "ఆగడు"  సినిమాలో కూడా తమన్నా ప్లేస్ లో ముందుగా హీరోయిన్గా నాయనతారనే అనుకున్నారట . కానీ మహేష్ బాబు వద్దనే వద్దు అంటూ అసలు నయనతార వద్దకు ఆఫర్ పోనీకుండా చేసేసాడట . అలా నయనతార అంటే మొదటి నుంచి కొంచెం నెగిటివ్ ఫీలింగ్ పెట్టుకొని ఉన్నాడు మహేష్ బాబు. ఆమె ప్రమోషన్స్ కి రాదు అన్న విషయం చాలామందికి తెలుసు.  ఆమె కొంచెం హెడ్ వెయిట్ గా బిహేవ్ చేస్తుంది అన్న విషయం కొన్నిసార్లు డైరెక్టర్లు కూడా బయటపెట్టారు.  అలా మహేష్ బాబు - నయనతారను దూరం పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది
..!!

మరింత సమాచారం తెలుసుకోండి: