దివంగత నటి సిల్క్ స్మిత మరణం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.ఆమె ఎంతో ధైర్యవంతురాలని, కానీ పిరికిదానిలా ఆత్మహత్య చేసుకునే రకం కాదు అని ఆమెతో వర్క్ చేసిన చాలా మంది చెప్పారు. మరి అలాంటిది సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకున్నట్టు ఎవరు చిత్రీకరించారు.. అసలు ఆమెని చంపి ఆత్మహత్యగా చిత్రీకరించింది ఎవరు అనే విషయాలు చాలా మందిలో ఇప్పటికీ అనుమానం గానే ఉన్నాయి. అయితే సిల్క్ స్మిత బయోపిక్ పై రీసెంట్ గానే ఓ సినిమా అనౌన్స్ చేశారు. అయితే తాజాగా సిల్క్ స్మిత తమ్ముడు నాగవరప్రసాద్ అక్క మరణం పై షాకింగ్ కామెంట్లు చేశారు. రీసెంట్గా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో సిల్క్ స్మిత తమ్ముడు నాగవరప్రసాద్ మాట్లాడుతూ.. మా కుటుంబంలో ఎవరు పెద్దగా చదువుకోలేదు.కానీ మొదటిసారి మా అక్క సినిమాల్లోకి వెళ్ళింది. తనకు అదృష్టం కలిసి రావడంతో సినిమాల్లో స్టార్ అయ్యింది. ఇక మద్రాసులో సిల్క్ స్మిత ఉన్న సమయంలో చాలా సార్లు మా అక్కను కలవడానికి వెళ్లాను.

నేను మోటార్ ఫీల్డ్ లో వర్క్ చేసేవాడిని.ఇక నేను తరచూ ఆమె దగ్గరికి వెళ్లి వస్తున్న సమయంలో నా ఇబ్బంది చూడలేక నాకు ఒక కారు కూడా కొనిచ్చింది. అయితే మా అక్క మరణం మాలో ఎంతో ఆవేదన నింపింది. అసలు ఎలాంటి ఆనవాళ్లు లేకుండా ఆమెను చంపేశారు. సిల్క్ స్మిత చనిపోయేంత పిరికిది కాదు. ఆమె డబ్బు చూసి పెళ్ళై ముగ్గురు పిల్లలు ఉన్న ఓ వ్యక్తి ఆమెకు దగ్గరయ్యాడు. కానీ మా అక్క అదంతా పట్టించుకోకుండా అసలు ఆయన ఎలాంటి వాడో కూడా తెలుసుకోకుండా గుడ్డిగా నమ్మేసింది. ఆ తర్వాత చాలా డబ్బులు కూడా ఇచ్చింది. ఇప్పటివరకు మా అక్క సంపాదించిన డబ్బుల్లో ఒక్క రూపాయి కూడా మాకు దక్కలేదు. ఆమెని ప్లాన్ ప్రకారం చంపేశారు. ఆరోజు రాత్రి ఆయన ఆయన భార్య, పిల్లలు కలిసి సిల్క్ స్మిత ను చంపేశారు. ఆ తర్వాత చనిపోయిన దానికి సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు లేకుండా చేసి ఆమెనే స్వయంగా సూసైడ్ చేసుకొని మరణించింది అని నమ్మబలికారు.అయితే అక్కడికి మేము వెళ్లేసరికి అంతా మారిపోయింది.

అక్కడ మాకు ఎవరూ తెలియదు. మా కోసం మాట్లాడే వారు కూడా ఎవరూ లేరు. మా అక్క మరణ వార్త విని ఇండస్ట్రీ నుండి అర్జున్ తప్ప ఎవరూ రాలేదు. కానీ అక్కడే మా అక్క చుట్టుపక్కల వాళ్లు మాత్రం తండోపతండాలుగా వచ్చారు. ఆమె చనిపోక ముందే అన్నీ మార్చేసి నగలు, డబ్బు కొట్టేసి డాక్యుమెంట్లు కూడా వాళ్ల పేర్లు మీద మార్చుకొని ఒక్క రూపాయి కూడా లేకుండా చేశారు. మా అక్కను అనాధ శవంలా రోడ్డు మీద పట్టుకొని ఏడ్చాము అంటూ సిల్క్ స్మిత మరణం గురించి సంచలన విషయాలు బయటపెట్టారు ఆమె తమ్ముడు నాగవరప్రసాద్. అలాగే అప్పట్లోనే సిల్క్ స్మిత దాదాపు 20 కోట్ల వరకు ఆస్తిపాస్తులు సంపాదించిందని, కానీ ఆ 20 కోట్లలో ఒక్క రూపాయి కూడా మాకు చెందలేదు అంటూ నాగవర ప్రసాద్ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: