బాలీవుడ్ బ్యూటీ జాన్వికపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అతిలోకసుందరి శ్రీదేవి వారసురాలుగా జాన్వి కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. స్టార్ కిడ్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తన సినిమాలతో అభిమానులను ఆకట్టుకుంది. కానీ సినిమాల ద్వారా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. అయినప్పటికీ బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించింది. జాన్వి కపూర్ తెలుగులో దేవర సినిమాతో టాలీవుడ్ చిత్రపరిశ్రమకు పరిచయమైంది. 

దేవర సినిమాలో ఎన్టీఆర్ కు సరసన హీరోయిన్ గా నటించి అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్న సమయంలోనే జాన్వి కపూర్ కు తెలుగులో మరిన్ని సినిమాలలో అవకాశాలు వచ్చాయి. కాగా, జాన్వి కపూర్ తెలుగులో రామ్ చరణ్ సరసన నటించే అవకాశాన్ని అందుకుంది. ఈ సినిమాకు బుచ్చిబాబు దర్శకత్వం వహించనున్నాడు. ఆ సినిమా తర్వాత విజయ్ దేవరకొండతో సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. అంతేకాకుండా పుష్ప-3 సినిమాలోనూ ఐటమ్ సాంగ్ లో ఛాన్స్ వచ్చిందట.


ఈ విషయం తెలిసే జాన్వి అభిమానులు షాక్ అవుతున్నారు. ఇదిలా ఉండగా....ఈ బ్యూటీకి తన తల్లి శ్రీదేవి వలె దేవుడు మీద భక్తి చాలా ఎక్కువ. ప్రతిసారి తిరుమల శ్రీవారి వద్దకు వెళ్లడం లేదా వేరే దేవాలయాలకు వెళ్తూ అక్కడ పూజలు నిర్వహించడం వంటివి చేస్తూనే ఉంటుంది. కాగా, ఈ బ్యూటీ కొద్ది రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ పెళ్లి చేసుకోవాలని ఉందని షాకింగ్ కామెంట్ చేసింది. పెళ్లి చేసుకుని ముగ్గురు పిల్లలను కనాలని ఉందని చెప్పింది.

 కానీ తిరుపతిలో సెటిల్ అవ్వాలని ఉందని జాన్వి కపూర్ సంచలన కామెంట్ చేశారు. ప్రతిరోజు తిరుపతిలో అరటి ఆకులో భోజనం చేస్తూ గోవిందా గోవిందా అంటూ జపించాలని ఉందని చెప్పారు. తన భర్త లుంగీ కట్టుకొని ఉంటే అతనికి మసాజ్ చేయాలని ఉందని అన్నారు. అది చాలా రొమాంటిక్ గా ఉంటుందని అన్నారు. అలా చేయడం తనకు చాలా ఇష్టమని అన్నారు. అంతే కాకుండా జడలో ప్రతిరోజు మల్లెపూలు పెట్టుకొని మణిరత్నం పాటలు వింటూ కూర్చోవాలని ఉందని జాన్వి కపూర్ గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రస్తుతం జాన్వి కపూర్ గతంలో చేసిన ఈ కామెంట్లు వైరల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: