అది కూడా ఆయన నిర్మించిన సినిమా విడుదలకు ముందే పెద్ద ప్రకటన చేసి ఎంతో డేర్ చేశారు. తాను ఈ మాటలు చెప్పడానికి ఎంతో ధైర్యం చేస్తున్నానని అంటూనే .. నాగచైతన్య కెరియర్ లోనే తండేల్ మూవీ హయ్యస్ట్ గ్రాస్‌గా ఉంటుందని అరవింద్ అన్నాడు. ఒకవైపు ఐటీ అధికారులు వరస రైడ్స్ చేస్తుంటే .. మరో పక్క తండేల్ సినిమా భారీ కలెక్షన్లు రాబడుతుందని అల్లు అరవింద్ చెప్పటం .. ఐటీ అధికారులకు పెద్ద హింట్ ఇవ్వటమే అంటూ టాలీవుడ్ లో ఉన్న కొందరు తెగ చెవులు కోరుకుంటున్నారు.
అంతేకాకుండా అల్లు అరవింద్ ఈ మాటలతో ఆగలేదు .. తండేల్ సినిమాపై నాగచైతన్య రెండు సంవత్సరాలుగా పెద్ద వర్క్ చేస్తున్నాడనే విషయాన్ని కూడా ఆయన తోసిపుచ్చారు. సంవత్సరానికి పైగా వర్క్ చేసినందుకే ఆయనకు రెమ్యూనరేషన్ కింద చాలా ఇచ్చామని , రెండేళ్ల నుంచి వర్క్ చేస్తున్నారంటూ ఆయన మరింత పారితోషాకం డిమాండ్ చేస్తాడని అన్నాడు . ఇక ఈ సినిమాకు నాగచైతన్య తన కెరీర్ లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్నట్టు ఇప్పటికే వార్తలు బయటకు వచ్చాయి .. ఇక ఇప్పుడు మొత్తానికి ఈ మాటలతో అల్లు అరవింద్ మరోసారి ఐటి అధికారులను తన మీదకి ఆకర్షించారు.