అలాగే మిగిలిన వారి సంగతి నాకు తెలియదు .. ఇక్కడ నిజంగా ఆయనకు తెలియకపోవచ్చు కానీ టాలీవుడ్ లో వినిపించే పెద్ద నెంబర్లు వింటే కొంత అనుమాన పడాల్సిందే .. రాజకీయ నాయకులు ఆస్తులు వివరాలు డేటా ఓపెన్ గా బయటకు తెలుస్తుంటాయి .. కానీ సినిమా హీరోలవి ఎప్పుడు బయటకు తెలియవు. ఒక సీనియర్ హీరో రెమ్యూనరేషన్ 70 కోట్లు .. ఇంత మొత్తం ఆయన వైట్లో తీసుకుంటున్నారో లేదో తెలియాలంటే అది ఇన్కమ్ టాక్స్ వారికి మాత్రమే తెలుస్తుంది .. మరో సీనియర్ హీరో 25 కోట్ల వరకు అందుకుంటున్నారు .. ఈ హీరో సగానికి సగం బ్లాక్ లో తీసుకుంటారని టాక్ కూడా ఉంది. ఇక మరో సీనియర్ హీరో ఎక్కువగా వైట్‌ను అందుకుంటాడు ..
అయితే పొలిటికల్ పనులు మిగిలిన వ్యవహారాలు ఉంటే మాత్రం బ్లాక్ తీసుకుంటారని టాక్ కూడా ఉంది. ఇక 100 కోట్ల నుంచి 200 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్ హీరోలు మొత్తం వైట్ చూపిస్తారని అనుకోవటం అనుమానమే .. ఇందులో ఎవరికి ఏం తెలుసు ఇన్కమ్ టాక్స్ శాఖ అధికారులు హీరోల ఇంటి మీదకు వచ్చి చాలా అంటే చాలా రోజులు అయింది .. గతంలో హీరోల ఇంటిలోనే ఎక్కువగా ఇలాంటి దాడులు జరిగేవి .. కానీ ఇప్పుడు అసలు హీరోల దగ్గరికి ఇలాంటివి రావటం లేదు. చిత్ర పరిశ్రమలో బ్లాక్ మనీకి అసలు మూలం అక్కడే ఉందన్న విషయం ఐటి అధికారులు గుర్తించాలి .. అలాగే ఆ దిశగా కదిలితే కొందరు నిర్మాతలు హ్యాపీగా ఉంటారు.