అలా వైకుంటపురంలో , పుష్పవన్ , సరిలేరు నీకెవ్వరు లాంటి సినిమాలకు కూడా గతంలో వచ్చిన రేటింగ్ తో పోలిస్తే కల్కి మూవీ టిఆర్పిని కంపేర్ చేసి చూస్తే .. డిజాస్టర్ అనే పదం చాలా చిన్నది అనిపిస్తుంది .. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన అలా వైకుంఠపురంలో సినిమాకు బుల్లితెర చరిత్రలోనే రికార్డు స్థాయిలో 29.4 రేటింగ్ వచ్చింది .. మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాకు కూడా 23.4 టిఆర్పి వచ్చింది . పవన్ కళ్యాణ్ సాయి ధరమ్‌తేజ్ కాంబినేషన్లో వచ్చిన బ్రో సినిమాకు కూడా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాఫ్ గా నిలిచింది .. ఈ సినిమా కూడా మొదటిసారి బుల్లితెరపై వచ్చినప్పుడు 7.2 రేటింగ్స్ వచ్చింది ..
ఇప్పుడు కల్కి ఈ సినిమాల టిఆర్పి తో వెండితెరకు బుల్లితెరకు మధ్య ఉన్న తేడా క్లియర్ గా తెలిసిపోతుంది .. హనుమాన్ , గుంటూరు కారం లాంటి సినిమాలకు బుల్లితెర ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రేటింగ్స్ వచ్చాయి .. ఫ్యామిలీ ప్రేక్షకులు టీవీల్లో ఈ సినిమాలను బాగా చూశారు . ఇక పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఈ రీసెంట్ టైమ్స్ లో ఎక్కువగా యాక్షన్ సినిమాలే చేస్తున్నాడని , మంచి ఫ్యామిలీ మూవీ వస్తే తప్ప టిఆర్పిల్లో భారీ రికార్డులు ప్రభాస్ బద్దలు కొడతారని ఆయన అభిమానులు అంటున్నారు.