ముఖ్యంగా సంక్రాంతికి వస్తున్నాం అలాగే గేమ్ చేంజెస్ సినిమా నిర్మాతగా వ్యవహరించిన దిల్ రాజు టార్గెట్ గా.. ఈ ఐటి శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దిల్ రాజుకు సంబంధించిన కుటుంబ సభ్యులు అలాగే ఆయన నిర్మాణ సంస్థలపై కూడా దాడులు జరుగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే ఈ ఐటి శాఖ అధికారుల దాడులలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజును తీసుకెళ్లారు ఐటీ అధికారులు. దిల్ రాజు ఇంట్లో నాలుగు రోజులు పాటు కొనసాగిన ఐటీ సోదాల తర్వాత.. ఇవాళ దిల్ రాజును తీసుకెళ్లారు ఐటీ అధికారులు. దిల్ రాజు ఇంటి నుంచి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం దిల్ రాజును సాగర్ సొసైటీలోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కార్యాలయానికి తీసుకెళ్లారు అధికారులు. తమ వాహనాల్లోనే... దిల్ రాజును తీసుకు వెళ్లారు ఐటీ శాఖ అధికారులు.
అటు SVC కార్యాలయంలో కొనసాగుతున్నాయి ఐటీ సోదాలు. ఈ SVC ప్రొడక్షన్ కార్యాలయం నుంచి భారీ బడ్జెట్ సినిమాలు నిర్మాణం అయ్యాయి. అటు నిన్న రాత్రి సోదాలు ముగిశాక.. ఉదయం నుంచి లీగల్ ఫార్మాలిటీస్ పూర్తి చేస్తున్నారు అధికారులు. దిల్ రాజ్ , సోదరుడు, కూతురు కార్యాలయంలో దొరికిన పత్రాలను వెరిఫై చేస్తున్న అధికారులు....పెద్ద ఎత్తున నిధుల బదిలీ చేసినట్లు గుర్తించారట. ఇక ఈ సోదాలపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.