నందమూరి నటసింహం బాలకృష్ణ తన కెరీర్‌లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలలో నటించారు. బాలయ్య నటించిన 109వ సినిమా డాకూ మహారాజ్ ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. బాలయ్య నటించిన తొలి సినిమా తాతమ్మ కల 1974 ఆగస్టు 30న రిలీజ్ అయ్యింది. ఆయన నట ప్రస్థానంలో గతేడాది 50 యేళ్లు పూర్తి చేసుకున్నారు. బాలయ్య డాకూ మహారాజ్ హిట్ జోష్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత తన తర్వాత సినిమాను బోయపాటి శ్రీను దర్శకత్వం లో నటిస్తున్నారు.
అఖండ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాకు సీక్వెల్ గా వచ్చే అఖండ 2 తాండవం సినిమాలో బాలయ్య నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఏకధాటిగా పూర్తి చేసి వచ్చే దసరాకు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. బాలయ్య కెరీర్ లో 50వ సినిమా నారీ నారీ నడుమ మురారి కాగా.. 75వ సినిమా కృష్ణబాబు .. 100వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి .. ఇక బాలయ్య చివరి నాలుగు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.
బాలయ్య తన కెరీర్ లో నటించిన సినిమాల్లో ఏకంగా 71 సినిమాలు 100 రోజులు ఆడాయి. డైరెక్టుగా 100 రోజులు ఆడిన సినిమాలు ఈ 71 కావడం విశేషం. అలాగే బాలయ్య నటించిన లెజెండ్ సినిమా కడప జిల్లా లోని ప్రొద్దుటూరు లో ఏకంగా 1000 కు పైగా రోజులు ఆడడం విశేషం. రాయలసీమ జిల్లా ల్లో బాలయ్య నటించిన చాలా సినిమాలు ప్లాప్ అయినా కూడా 100 రోజులు ఆడేసి సెంచరీ కొట్టేశాయి. అఖండ 2 తాండవం తర్వాత బాలయ్య మలినేని గోపీ చంద్ డైరెక్షన్ లో మరో సినిమా చేస్తాడు.