అయితే ఇప్పుడు మరో షాక్ తగిలిందని చెప్పవచ్చు. తాజాగా గేమ్ ఛేంజర్ సినిమా అల్ట్రా హెచ్డీ లో ఆన్లైన్లో ప్రత్యక్షమవడంతో అందరూ షాక్ అవుతున్నారు. అయితే ఇది థియేటర్ ప్రింట్ కాదని, మూవీ ఎడిటింగ్ టీం నుంచే ఇది లీక్ అయిందని అభిమానులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సినిమాలో సీజీ వర్క్ లేదని స్పష్టంగా కనబడుతోందని కూడా చెబుతూ ఉండడం గమనార్హం. అంతేకాదు రూ.కోట్లు పెట్టి సినిమాలు తీస్తే.. ఇలా పైరసీ చేస్తారా? అని మండిపడుతూ అలాంటి పైరసీ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.
గేమ్ ఛేంజర్ సినిమా విషయానికి వస్తే.. అంజలి, కియారా అద్వానీ హీరోయిన్లుగా నటించగా.. ఎస్ జె సూర్య, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ముఖ్యంగా రామ్ చరణ్ ఇందులో ద్విపాత్రాభినయం పోషించారు. ఇక వీరితోపాటు సముద్రఖని కూడా తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. మొత్తానికైతే ఆర్ఆర్ఆర్ లాంటి గొప్ప చిత్రం తర్వాత రామ్ చరణ్ నటించిన ఈ సినిమా ఇలా డిజాస్టర్ గా మిగలడంతో అందరూ ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు.