గత నాలుగు రోజుల టాలీవుడ్ లో ఉన్న బడ నిర్మాతలు దర్శకులపై ఐటి రైడ్స్‌ జరుగుతున్న విషయం తెలిసిందే .. దిల్ రాజు ఇంటి దగ్గర మొదలుపెట్టి పుష్ప2 నిర్మాతలు, దర్శకుడు సుకుమార్ , అభిషేక్ అగర్వాల్ వంటి బడ వ్యక్తులపై కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయి .. ఇదే క్రమంలో పుష్పా2 నిర్మాతల ఐటీ లెక్కల విషయంలో చాలా తప్పులు ఉన్నాయని కూడా తెలుస్తుంది. ప్రధానంగా 531 కోట్ల రూపాయలకు సంబంధించి లెక్కలకు సరిగా టాక్స్ కట్టలేదని కూడా వారు అంటున్నారు .. అలాగే టాలీవుడ్ మరో నిర్మాత దిల్ రాజు ఇంట్లో గత నాలుగు రోజుల నుంచి ఈ దాడులు అధికారులు నిర్వహిస్తూనే ఉన్నారు .. ఇదే క్రమంలో ఆయన భార్యని బ్యాంకుకు తీసుకువెళ్లి మరి లాకర్లను ఓపెన్ చేయించి మరి విచారణ జరిపిన విషయం సంచలనంగా మారింది .. అలాగే ఈ సంక్రాంతికి విడుదలైన సినిమాలకు సంబంధించిన నిర్మాతలు కలెక్షన్ పాస్టర్లు వేయటంవల్లే ఈ రచ్చ ఎంతవరకు వెళ్లిందని అంటున్నారు .. ఇదే క్రమంలో ఒకపక్క దిల్ రాజు ఇంట్లో ఐటి రైడ్స్  జరుగుతుండగా మరోపక్క ఆయన నిర్మించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ సక్సెస్ సెలబ్రేషన్లు జరుపుకుంది.
 

ఇక సినిమాలకు వేసినా కలెక్షన్ల పోస్టర్ల వల్ల ఇంత పెద్ద రచ్చ జరుగుతుందని ఇండస్ట్రీలో ఉన్న కొందరు అంటుంటే .. తాజా గా నిన్న సంక్రాంతికి వస్తున్నా మూవీ 230 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్టు దిల్ రాజు టీమ్‌ కొత్త పోస్టర్ను విడుదల చేయటం ఇప్పుడు అందరికీ షాక్ ఇచ్చింది .. ఇదే క్రమంలో ఈరోజు లేదా రేపు టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలపై కూడా ఐటీ దాడులు జరగవచ్చు అని కూడా తెలుస్తుంది .. స్టార్ హీరోలు  ఈ రీసెంట్ టైమ్స్ లో రెమ్యూనరేషన్ కి బదులుగా సినిమాలకి వచ్చిన లాభాల్లో వాటాలను తీసుకుంటున్నారు .. మీడియం రేంజ్ హీరోల నుంచి స్టార్ హీరోల వరకు అందరూ ఇదే ఫార్ములాలో వెళ్తున్నారు .. ఎందుకంటే అందరూ పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేస్తూ మార్కెట్ ని విపరీతంగా పెంచేశారు .. అలాగే థియేట్రికల్ రైట్స్ తో పాటు డిజిటల్ రైట్స్ కూడా భారీ స్థాయిలో డిమాండ్ పెరిగిపోయింది .. ఇలాంటి సమయంలో రెమ్యూనరేషన్ కంటే లాభాల్లో వాటాలు తీసుకుంటేనే మంచిదని అందరూ ఇదే నిర్ణయానికి వచ్చారు.

 

అందుకే ఇప్పుడు వాటికి సంబంధించిన లెక్కలను పరిశీలించడానికి ఐటి అధికారులు దృష్టిని వాటిపై మళ్లించబోతున్నట్టు తెలుస్తుంది .. ఇక పుష్పా 2 సినిమాకి దర్శకుడు , హీరో కూడా లాభాల్లో వాటా తీసుకున్నారు .. ఇప్పుడు ఏ క్షణం లో ఆయన ఐటీ అధికారులు అల్లు అర్జున్ ఇంటిపై దాడులు నిర్వహించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి .. అంతేకాకుండా కల్కి నిర్మాత అశ్విని దత్‌ పై కూడా త్వరలోనే ఈ దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు .. ఈరోజు దిల్ రాజు తో పాటు పలువురు ప్రముఖుల ఇళ్లపై నిర్వహిస్తున్న దాడులు పూర్తికావస్తున్నాయని తెలుస్తుంది .. ఒక దిల్ రాజు కోసమే కేవలం నాలుగు రోజుల సమయం వెచ్చిచ్చారంటే ఐటీ అధికారులు చిత్ర పరిశ్రమ నిర్మాతులపై ఎంత సీరియస్ గా ఉన్నారో అందరూ అర్థం చేసుకోవచ్చు .. ఇక నిన్న దిల్ రాజు తల్లికి అస్వస్థకు గురైతే ఐటీ అధికారులే తమ కారులోనే  హాస్పిటల్ కి తీసుకువెళ్లి వైద్యం అందించారు .. ఇలా ఇంత పకడ్బందీగా ఈ దాడులు చేస్తున్నారు .. రాబోయే రోజుల్లో ఈ ఫలితాలు ఎలా ఉండబోతాయో కాలమే చెబుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: