ఇక మన తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా ఫ్యామిలీ గురించి ఎంత చెప్పుకున్నా త‌క్క‌వే .. మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఈ కుటుంబం నుంచి వచ్చిన హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ టాలీవుడ్ నుంచి పాన్ ఇండియాలో అగ్ర హీరోలుగా దూసుకుపోతున్నారు .. చిరంజీవి కూడా ఆరుపదుల వయసు పెరిగిన కూడా వరస సినిమాలతో బాక్సాఫీస్ ముందుకు వస్తున్నాడు. ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలు కన్నా రాజకీయాల్లో బిజీగా ఉంటూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా సేవలు అందిస్తున్నారు. ఇదే క్రమంలో చిరంజీవి కొడుకు రామ్ చరణ్ మాత్రం వరుస క్రేజీ సినిమాలతో పాన్ ఇండియా బాక్సాఫీస్ ముందుకు వస్తున్నాడు ..


ఇక ఇప్పటికే రంగస్థలం , త్రిబుల్ ఆర్ సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన రామ్ చరణ్.. ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు .. ఈ సినిమాను సౌత్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించాడు .. తెలుగు అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాతగా ఉన్నారు .. అయితే రామ్ చరణ్ ఈ సినిమాకు చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నారట .. అయితే ఇప్పుడు ఆ తీసుకున్న రెమ్యూనిరేషన్ ని కూడా  వెనక్కి తిరిగి ఇచ్చేసాడనే వార్తలు బయటకు వస్తున్నాయి. ఇక గేమ్ చేంజర్  సినిమాకు మొత్తంగా 450 కోట్ల వరకు బడ్జెట్ పెట్టారు .. ఈ సినిమా రిలీజ్ తర్వాత సగటు ప్రేక్షకుడిని ఆకట్టుకోవటంలో పూర్తిగా ఫెయిల్ అయింది .. ఇప్పుడు రామ్ చరణ్ ఈ సినిమాకు 120 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకోవాల్సింది .. కానీ ఇప్పుడు అందులో సగం 60 కోట్ల రెమ్యూనరేషన్ మాత్రమే ఆయన తీసుకున్నారట.


ఇక ఇప్పుడు ఈ సినిమాకి బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ టాక్ రావటంతో రామ్ చరణ్ 60 కోట్లలో మళ్లీ తిరిగి 30 కోట్లు తిరిగి నిర్మాతకు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక దీంతో రామ్ చరణ్ ఈ సినిమా ప్లాప్ ప‌ట్ల పూర్తి బాధ్యతను వహించడం అనేది నిజంగా గొప్ప విషయం అని చెప్పాలి.   శంకర్ లాంటి దర్శకుని నమ్మి రామ్ చరణ్ , దిల్ రాజు తమ కెరియర్ లో భారీగా నష్టపోయారు .. ఇక దీంతో నిర్మాత దిల్ రాజును నష్టాల నుంచి కాపాడాలనే ఉద్దేశంతో మెగా హీరో ఇలా చేసినట్టు తెలుస్తుంది .. అలాగే ఇప్పుడు దిల్ రాజు బ్యానర్లో మరో సినిమా చేయడానికి రామ్ చరణ్ ఆయనకు డేట్స్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది.  అయితే ఇప్పుడు దిల్ రాజు , రామ్ చరణ్ కాంబినేషన్లో మరో సినిమా ఎప్పుడు వస్తుంది అనేది తెలియాల్సి ఉంది .


మరింత సమాచారం తెలుసుకోండి: