నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. బాలయ్య కు శుక్ర మహార్దశ నడుస్తోంది. ఆయన పట్టిందల్లా బంగారం అవుతోంది. ఆయన ఏ సినిమా చేసినా .. ఏ కథ లో నటించినా .. ఏ హీరోయిన్ పక్కన చేసినా.. ఏ డైరెక్టర్ తో సినిమా చేసినా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతోంది. బాలయ్య వరుసగా అఖండ - వీరసింహా రెడ్డి - భగవంత్ కేసరి - తాజాగా డాకూ మహారాజ్ సినిమాలతో వరుస హిట్లు తన ఖాతా లో వేసుకున్నారు.
ఇదిలా ఉంటే బాలయ్యకు డైరెక్షన్ అంటే ఇష్టం.. ఎప్పటకీ అయినా ఓ సినిమా ను డైరెక్ట్ చేయాలనేది ఆయన జీవిత ఆశయం. ఈ క్రమంలోనే తన స్వీయ దర్శకత్వంలో మహాభారత కథ ఆథారంగా నర్తనశాల సినిమాను ప్రారంభించారు. దివంగత హీరోయిన్ సౌందర్య ద్రౌపది పాత్రలో ఎంపిక అయ్యారు. కొంత షూటింగ్ జరిగాక సౌందర్య చనిపోయారు. ఆ తర్వాత కొన్ని కారణాలతో ఈ సినిమా షూటింగ్ ముందుకు జరగలేదు. మూడేళ్ల క్రితం ఈ సినిమా లో షూట్ చేసిన కొన్ని నిమిషాల సన్నివేశాలను ఓటీటీలో రిలీజ్ చేశారు. కరోనా టైం లో ఇది రిలీజ్ చేశారు.
ఈ సినిమా తో పాటు గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా లోని కొన్ని సీన్లతో పాటు పెద్దన్నయ్య సినిమా క్లైమాక్స్ కు బాలయ్యే స్వయంగా దర్శకత్వం వహించారు. అలాగే బాలయ్య కు రైతు అనే టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కించాలన్న కోరిక ఉంది. వాస్తవాని కి కృష్ణవంశీ దర్శకత్వం లో ఈ సినిమా చేయాలని కూడా అనుకున్నారు. అయితే కథ బాలయ్య అనుకున్నట్టుగా రాలేదు. దీంతో ఈ సినిమా పట్టాలు ఎక్కలేదు.. మధ్యలోనే ఆగిపోయింది.