కానీ వందలో 80% మంది జూనియర్ ఎన్టీఆర్ ని ఇష్టపడుతూ ఉంటారు . లైక్ చేస్తూ ఉంటారు దానికి కారణం ఆయన నిర్మలమైన మనసే. జూనియర్ ఎన్టీఆర్ అంటే కేవలం జనాలకి కాదు.. స్టార్ సెలబ్రిటీస్ కి కూడా చాలా ఇష్టం. మరీ ముఖ్యంగా రాజమౌళి.. జూనియర్ ఎన్టీఆర్ ని ఏ రేంజ్ లో పొగిడేస్తాడు అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . రామ్ చరణ్ - చిరంజీవి కూడా చాలాసార్లు జూనియర్ ఎన్టీఆర్ ని పొగిడేస్తూ ఆయన డాన్స్ అంటే ఇష్టం అంటూ చెప్పుకు వచ్చారు .
కాగా రామ్ చరణ్ అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ..జూనియర్ ఎన్టీఆర్ పేరుని ఒకే విధంగా సేవ్ చేసుకున్నారు అన్న వార్త ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. "NTR" అంటూ ఈ ముగ్గురు తారక్ పేరు ను తమ మొబైల్ లో సేవ్ చేసుకున్నారట . అంతేకాదు తారక్ ఎక్కడ కనిపించిన సరే "ఏరా ఎన్టీఆర్" అంటూ చాలా ప్రేమగా చనువుగా ఆప్యాయంగా మెగాస్టార్ పలకరిస్తూ ఉంటారట. ఇదే విషయాన్ని జనాలు బాగా ట్రెండ్ చేస్తున్నారు . ప్రెసెంట్ జూనియర్ ఎన్టీఆర్ బడాబడా సినిమాలతో తన లైఫ్ ని వేరే లెవెల్ లో మార్చుకోవడానికి బాగా కష్టపడుతున్నాడు. త్వరలోనే వార్ 2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్..!