ఫాహద్ ఫాజిల్, అనసూయ, సునీల్ వంటి తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన పుష్ప-2 సినిమా ఘన విజయాన్ని సాధించింది. అల్లు అర్జున్ కెరీర్ లో ఇంత పెద్ద సక్సెస్ సాధించిన సినిమా పుష్ప-2 అని చెప్పవచ్చు. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా కోట్లలో కలెక్షన్లు వచ్చాయి. పుష్ప-2 సినిమా ప్రపంచవ్యాప్తంగా కలిపి 1800 కోట్లకు పైగా వసూళ్లను సాధించగా.... ఇప్పుడు టీవీలలో కూడా అత్యధిక టిఆర్పిలను సాధించే అవకాశం ఉన్నట్లుగా సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇప్పటికే పుష్ప-1 సినిమాకు టెలివిజన్ రేటింగ్ లో 25.2 టిఆర్పి రావడం ద్వారా ఈ సినిమాను ప్రేక్షకులు ఎంత సపోర్ట్ ఇస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పుష్ప-2 ది రూల్ సినిమా కూడా అదే రేంజ్ లో టీవీ రేటింగ్స్ సాధించే అవకాశం ఉన్నట్లుగా సిని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. కాగా, అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురంలో సినిమా ఇప్పటికీ టీవీలలో నెంబర్ వన్ టీఆర్పి రికార్డును 29.4 తో కొనసాగించడం గమనార్హం.
ఇది ఇప్పటివరకు టాలీవుడ్ లో ఏ సినిమాకు రాలేనటువంటి ఘనతగా చెప్పవచ్చు. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటన అద్భుతంగా ఉంది. తమన్ సంగీతం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలాగే అల్లు అర్జున్ నటించిన మరో సినిమా దువ్వాడ జగన్నాథం కూడా 21.7 టిఆర్పితో ఈ లిస్ట్ లో ఐదవ స్థానంలో నిలిచింది. ఇక పుష్ప-2 సినిమా ఏ స్థానంలో నిలుస్తుందో చూడాలి.