సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో సినిమాలలో నటించి మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. తన కెరీర్ లో విపరీతంగా సినిమాలలో నటించిన మహేష్ బాబు భారీగా అభిమానులను దక్కించుకున్నాడు. మహేష్ బాబు తన తదుపరి సినిమాను దర్శకుడు రాజమౌళితో చేయనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కోసం మహేష్ బాబు ప్రిపేర్ అవుతున్నాడు.


గుంటూరు కారం సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో మహేష్ బాబు తన మేకోవర్, లుక్స్ ను పూర్తిగా మార్చుకున్నాడు. ఇప్పటికే మహేష్ బాబుకి సంబంధించిన న్యూ లుక్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. జక్కన్న - మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోయే ప్రాజెక్టు కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా హాలీవుడ్ రేంజ్ లో తీయబోతున్నారనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.


దీంతో ఎస్ఎస్ఎంబి 29 సినిమాపై భారీ హైప్ నెలకొంది. ఈ సినిమాను అమెజాన్ అడవుల నేపథ్యంలో నాన్ స్టాప్ అడ్వెంచర్ గా తీయనున్నారని సినీవర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఓ సెట్ ను నిర్మించి కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లుగా సమాచారం అందుతోంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో ఆ సెట్ వేసేందుకు రూ.50 కోట్లు ఖర్చు చేశారట.  ఈ నెలాఖరులో మరో షెడ్యూల్ కూడా ప్రారంభించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఎస్ఎస్ఎంబి 29 సినిమాలో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రాను ఫిక్స్ చేశారట.


కానీ ప్రస్తుతం ప్రియాంక చోప్రా ఇతర సినిమా షూటింగ్ లలో బిజీగా ఉన్నారట. ఆ కారణంగా ఆమె బల్క్ డేట్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సినీ వర్గాల్లో జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి. ఈ సినిమా కోసం మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ ఈ సినిమా రిలీజ్ అయ్యే సరికి చాలా సమయం పట్టేలా ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: