ఐశ్వర్య రాజేష్ ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ ఈ బ్యూటీకి పెద్దగా గుర్తింపు రాలేదు. రీసెంట్ గా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఐశ్వర్య రాజేష్ కు విపరీతంగా క్రేజ్ పెరిగిపోయింది. ఈ సినిమాలో తన అద్భుతమైన నటన, అమాయకమైన డైలాగ్స్ తో అభిమానులను కట్టిపడేసింది. ఈ సినిమాలో తన నటనను చూసిన ప్రతి ఒక్కరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.


సంక్రాంతికి వస్తున్నాం సినిమా అనంతరం ఐశ్వర్య రాజేష్ కు వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఈ సినిమాలో వెంకటేష్ కు భార్య పాత్రలో ఐశ్వర్య రాజేష్ అద్భుతంగా నటించింది. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో ఐశ్వర్య రాజేష్ కు విపరీతంగా అభిమానులు పెరిగిపోయారు. తాజాగా ఈ బ్యూటీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా సక్సెస్ అవ్వడంతో వరుసగా ఇంటర్వ్యూలో ఇస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య రాజేష్ పాల్గొన్నారు.


అందులో భాగంగా మాట్లాడుతూ.... చిన్ననాటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ అంటే తనకు చాలా అభిమానం అని చెప్పింది. అతనిని స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా నుంచి చూస్తున్నానని అన్నారు. ఎన్టీఆర్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అని ఐశ్వర్య రాజేష్ అన్నారు. ఎన్టీఆర్ తో కలిసిన నటించే అవకాశం వస్తే అసలు వదులుకోనని చెప్పారు. తారక్ డైలాగ్ డెలివరీ, యాక్టింగ్, డ్యాన్స్ అంటే తనకు చాలా ఇష్టమని ఐశ్వర్య రాజేష్ చెప్పారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో ఎన్టీఆర్ నటించే తీరు తనకు చాలా బాగా నచ్చుతుందని ఐశ్వర్య రాజేష్ అన్నారు.


అతనితో కలిసి పనిచేయాలని ఎన్నో రోజుల నుంచి కోరుకుంటున్నానని ఐశ్వర్య రాజేష్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ తో కలిసి నటించే అవకాశం వస్తే అసలు వదులుకోనని చెప్పింది. ఇప్పటివరకు అవకాశం రాలేదు. కానీ తప్పకుండా ఎన్టీఆర్ తో కలిసి నటించే అవకాశం రావాలని కోరుకుంటున్నానని ఐశ్వర్య రాజేష్ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చింది. ఎన్టీఆర్ గురించి ఐశ్వర్య రాజేష్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: