టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఉన్న అగ్ర హీరోయిన్లలో సమంత ఒకరు. ఈ బ్యూటీ గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. ప్రపంచవ్యాప్తంగా సమంతకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. తన అద్భుతమైన నటన, అందంతో సమంత ఎంతోమంది అభిమానులను ఆకట్టుకుంటుంది. టాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించిన సమంత కొన్నేళ్లపాటు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ తన హవాను కొనసాగించింది. స్టార్ హీరోలు అందరి సరసన నటించింది. యంగ్ హీరోలు, స్టార్ హీరోలు అనే తేడా లేకుండా వరుస పెట్టి సినిమాలు చేసింది.


మహేష్ బాబు, నాని, నాగచైతన్య, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు అందరి సరసన ఆడి పాడింది. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిస్తోంది. ప్రస్తుతం తన పూర్తి ధ్యాసను బాలీవుడ్ సినిమాల పైన పెట్టింది. రీసెంట్ గా సమంత, వరుణ్ ధావన్ కలిసి జంటగా నటించిన హనీ బన్నీ సిరీస్ మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ క్రమంలోనే సమంతకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి.


ఈ సమయంలోనే సమంత బాలీవుడ్ లో నటిస్తూ బిజీగా ఉండడంవల్ల అక్కడే ఉండాలని నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజుల క్రితమే ముంబైలో విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసింది. చాలా డబ్బు ఖర్చు పెట్టి ఈ ఇంటిని కొనుగోలు చేసి అక్కడే ఉంటుంది. ఈ క్రమంలోనే సమంతకు కొత్త సమస్యలు మొదలయ్యాయట. ప్రస్తుతం సమంత ఉంటున్న ఇంట్లో వాస్తు దోషం ఉందట. వెంటిలేషన్ సరిగ్గా లేదట. అందువల్ల సమంత కొత్త ఇంట్లోకి మారాలని ప్లాన్ లో ఉందట. మళ్లీ ఎక్కడ ఇల్లు కొనుగోలు చేయాలని విషయంలో సమంతకు కాస్త ఇబ్బందులు ఎదురవుతున్నాయని జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి.


మరి సమంత కొత్త ఇంట్లోకి మారుతుందా లేకపోతే ప్రస్తుతం తాను ఉంటున్న ఇంటిని సెట్ చేపించుకుంటుందా అనే విషయాలు తెలియాల్సి ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ సమంతను మాత్రం ఎప్పుడూ ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉందంటూ తన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా, సమంత తెలుగులో చాలా రోజుల నుంచి సినిమాలు చేయడం లేదు. మళ్లీ ఎప్పటిలానే వరుస పెట్టి తెలుగులో సినిమాలు చేయాలని తన అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఈ విషయంపైన సమంత ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: