వీటికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా త్వరలోనే బయటకు రానున్నాయి . ఇక కరోనా తర్వాత దిల్ రాజు నిర్మించిన ఎక్కువ సినిమాలు ప్లాప్ అవుతూనే ఉన్నాయి .. కానీ ఆయన డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర చాలావరకు ఘనవిజయాలు అందుకున్నాయి .. త్రిబుల్ ఆర్ , సలార్ కే జి ఎఫ్ , పుష్ప2 ఇలా ఎన్నో సినిమాలకు దిల్ రాజు నైజాంలో డిస్ట్రిబ్యూటర్ గా ఉంటూ వందల కోట్లకు పైగా లాభాలు తెచ్చుకున్నారు .. ఇప్పుడు ఈ సంక్రాంతికి ఆయన దగ్గర నుంచి వచ్చిన గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి .. వీటిలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ మాత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది .. ఇప్పటికే ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ స్థాయిలో కలెక్షన్ల వర్షం కురుస్తుంది .. ఈ సినిమా పది రోజుల్లోనే 230 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టుకుంది.
ఈ సినిమా ఫుల్ రన్ కంప్లీట్ అయ్యేలోపు 300 కోట్లకు పైగా లాభాలు అందుకోవచ్చు అని అంటున్నారు .. ఇప్పుడు దిల్ రాజుకి లాభాలు వచ్చినట్టే వచ్చి చివరికి భారీ నష్టాలు తెచ్చి పెట్టబోతున్నాయి .. ప్రధానంగా ఆయనకి భారీ లాభాలు డిజిటల్ రైట్స్ రూపంలోనే వస్తాయి .. ఈ రీసెంట్ టైమ్స్ లో ఈ డిజిటల్ రైట్స్ కారణంగా వచ్చే లాభాలను థియేట్రికల్ బిజినెస్ ను దాటేస్తున్నాయి .. దీనికి కారణంగా నిర్మాతలు ఎక్కువ శాతం నష్టపోవటం అనేది చాలా తక్కువగా చెప్పవచ్చు .. అందుకే ఇప్పుడు అలా వచ్చిన లాభాలకు తగ్గట్టుగా జిఎస్టిలు కట్టలేదని ఐటి అధికారులు చెప్పుకొస్తున్నట్టు తెలుస్తుంది. ఇలా దిల్ రాజుకు ఊహించిన విధంగా ఐటీ అధికారుల నుంచి గట్టి షాక్ తగిలింది .. సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో ఒక సినిమా పెద్ద హిట్ అయిందని ఆనందం రీల్ రాజులో చూసాం కానీ ఈలోపే ఇలాంటి అనుకొని సమస్యలో ఆయన ఇరుకోవటం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయం.