బాలీవుడ్ లో దుమ్మురేపుతు ప్రస్తుతం టాలీవుడ్ ని షేక్ చేసేందుకు ప్రయత్నిస్తున్న జాన్వి కపూర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ లో తనదైన రీతిలో సూపర్ చిత్రాలలో నటించి మంచి ఫేమ్ ని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ . ఇక తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి జోడిగా దేవరా మూవీలో నటించి అదరగొట్టింది . ఈ చిత్రంతోనే మొదటిసారిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది ఈ చిన్నది . ఇక ప్రస్తుతం రామ్ చరణ్ మూవీ లో కూడా హీరోయిన్ గా ప్లే చేస్తుంది . ఈ మూవీకి ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు .


ఇక ఈమె వ్యక్తిగత జీవితానికి వస్తే .. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మనవడు అయినా శిఖర్  పహారియా తో డేటింగ్ లో ఉంది . వీళ్ళిద్దరూ కలిసి లొకేషన్స్ కి వెళ్తూ అందుకు సంబంధించిన ఫోటోలను వీడియోలను కూడా అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఇక ఈ రిలేషన్ పై ఈ భామ ఇప్పటివరకు సరిగ్గా స్పందించిందే లేదు. ఈ క్రమంలోనే జాన్వి కపూర్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల బాలీవుడ్ లోని ఓ షోలో ఈ చిన్నది పెళ్లి డ్రీమ్ గురించి కామెంట్స్ చేసింది.


ఓ ఇంటర్వ్యూలో భాగంగా.. యాంకర్.." నీ పెళ్లి తర్వాత లైఫ్ ఎలా ఉండాలి అని నువ్వు అనుకుంటున్నావు " అని ప్రశ్నించగా.. దీనికి జాన్వి స్పందిస్తూ.." నేను పెళ్లి చేసుకుని తిరుమల తిరుపతిలో సెటిల్ అవ్వాలి . ముగ్గురు పిల్లలతో ఉండాలి. రోజు అరటి ఆకుల్లో తినాలి. అదేవిధంగా రోజు గోవిందా గోవిందా అని వింటూ ఉండాలి. మణిరత్నం సాంగ్స్ కూడా వినాలి. మా ఆయన లుంగీలో ఉండాలి. ఎందుకంటే అది చూడడానికి రొమాంటిక్గా ఉంటుంది " అంటూ ఈ హాట్ బ్యూటీ హాట్ కామెంట్స్ చేసింది . ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: