నిర్మాత నాగ వంశీ బాలకృష్ణకి మధ్య చెడిందా.. నిజంగానే వారిద్దరి మధ్య గొడవలు ఉన్నాయా..అందుకే నాగ వంశీ యాలా చేశారా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న ప్రశ్నలు ఇవి..మరి ఇంతకీ డాకు మహారాజ్ సినిమాతో నాగ వంశీ బాలకృష్ణ సినిమాని నిర్మించారు. అలాంటిది వీరిద్దరి మధ్య గొడవలు ఏంటి అని చాలామంది కామెంట్లు కూడా పెడుతున్నారు. ఇక వీళ్లిద్దరి మధ్య గొడవలు ఉన్నాయి అనడానికి కారణం డాకు మహారాజ్ సక్సెస్ ఈవెంట్ కి నిర్మాత నాగ వంశీ రాకపోవడమే.. డాకు మహారాజ్ మూవీ విడుదలకు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా అనంతలో చేద్దామని అన్ని రకాల కార్యక్రమాలు పూర్తి చేశారు. కానీ సడన్గా తిరుమలలో జరిగిన తొక్కేసాలట కారణంగా ఈవెంట్ ని రద్దు చేశారు. కానీ ఎక్కడైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయ్యిందో అక్కడే మళ్ళీ సక్సెస్ మీట్ ని ఘనంగా నిర్వహించారు మూవీ మేకర్స్. 

అయితే డాకు మహారాజ్ సక్సెస్ ఈవెంట్ కి బాలకృష్ణ తో పాటు అందులో నటించిన హీరోయిన్లు డైరెక్టర్ బాబీ అందరూ వచ్చారు. కానీ నిర్మాత నాగవంశీ మాత్రం కనిపించలేదు. దీంతో నాగ వంశీకి బాలకృష్ణకి మధ్య చెడింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఈ వార్తలు వినిపించడానికి ఓ రీజన్ ఉంది. అదేంటంటే నాగ వంశీ డాకు మహారాజ్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా నిర్మించబోతున్నారట. అయితే ఎన్టీఆర్ కి బాలకృష్ణకి మధ్య గొడవలు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం  డాకు మహారాజ్ సినిమా అయిపోయింది కాబట్టి బాలకృష్ణకు దూరంగా ఉండటమే మంచిది అని సక్సెస్ మీట్ కి నాగావంశీ రాలేదని కొంతమంది మాట్లాడుకుంటున్నారు  ఇక మరికొంత మందేమో అలాంటిదేమీ లేదు నాగ వంశీ ప్రస్తుతం ఇండియాలో లేరు దుబాయిలో ఉన్నారు. అందుకే ఈ సక్సెస్ ఈవెంట్లో కనిపించలేదు అని మాట్లాడుకుంటున్నారు.

 ఇంకొంత మంది మాత్రం ప్రస్తుతం టాలీవుడ్ నిర్మాతలపై ఐటి రైడ్స్ జరుగుతున్నాయి కదా.. ఈ ఐటీ రైడ్స్ తనవైపు ఎక్కడ మళ్లుతాయో అని నాగ వంశీ దుబాయ్ చెక్కేసినట్టు మాట్లాడుకుంటున్నారు. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు. ఎందుకంటే ఐటీ అధికారులు నాగ వంశీ ఇంటిని సోదాలు చేయాలనుకుంటే ఆయన ఎక్కడ ఉన్నా సరే పిలిపిస్తారు. ఇందులో నిజం లేదు. కానీ నాగ వంశీ వెకేషన్ కి దుబాయ్ వెళ్లడం కారణంగానే సక్సెస్ మీట్ కి రాలేదని తెలుస్తోంది. మరి నిజంగానే బాలకృష్ణ నాగ వంశీ మధ్య చెడిందా..వీరిద్దరి మధ్య గొడవలు ఉన్నాయా.. అందుకే సక్సెస్ ఈవెంట్ కి రాలేదా అనేది తెలియాలంటే నాగవంశీ క్లారిటీ ఇస్తే గాని తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: