పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ‘హరి హర వీర మల్లు’ చిత్ర పాటల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.హరి హర వీరమల్లు చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో అలరించనుంది. ఇదిలావుండగా హరి హర వీరమల్లు చిత్రం 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో భారీ బడ్జెట్ తో పీరియడ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో బాబీ డియోల్, నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి వంటి ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అణగారిన వర్గాల కోసం అన్యాయంపై పోరాడే యోధుడు కథగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ క్రమంలోనే ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన రెండు గ్లిమ్స్ వీడియోస్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ పాడిన ‘మాట వినాలి’ సాంగ్ విడుదలై ఆడియన్స్ నుండి బీభత్సమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. చాలా సింపుల్ గా ఉన్నటువంటి ఈ పాటకి సంబంధించిన విజువల్స్ ని కూడా చాలా గ్రాండ్ గా ఉండేలా చూసుకున్నారు మేకర్స్.

ఇకపోతే ఫిబ్రవరి 14 వ తేదీన ఈ సినిమాలోని రెండవ పాటని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. పూజిత పొన్నాడ స్పెషల్ గా డ్యాన్స్ వేసిన ఫెస్టివల్ థీమ్ సాంగ్ అద్భుతంగా వచ్చినట్టు తెలుస్తుంది. ఈ పాటతో ఈ చిత్రాన్ని నిర్మాత ఏఎం రత్నం ఎంత గ్రాండ్ గా తెరకెక్కించాడో ఫ్యాన్స్ కి తెలియబోతుందట. సినిమాకే హైలైట్ గా నిలవనున్న ఈ పాట చార్ట్ బస్టర్ గా నిలుస్తుందని బలమైన నమ్మకం తో చెప్తున్నారు మేకర్స్. సుమారుగా 500 మంది డ్యాన్సర్లు ఈ పాటలో కనిపించనున్నారట. సెట్ వర్క్స్ కూడా చాలా గ్రాండ్ గా ఉంటుందని సమాచారం. పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఇంతటి గ్రాండ్ విజువల్స్ ని ఇంతకు ముందు ఎప్పుడూ అభిమానులు చూడని విధంగా, సరికొత్త అనుభూతిని కలిగిస్తుందని అంటున్నారు.హరి హర వీరమల్లు చిత్రీకరణ తుది దశలో ఉంది. నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా చురుకుగా సాగుతున్నాయి. ఈ చిత్రాన్ని 2025, మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఇదిలావుండగా ప్రముఖ ఛాయగ్రాహకుడు మనోజ్ పరమహంస కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ సినిమాకి, లెజెండరీ కళా దర్శకుడు తోట తరణి అద్భుతమైన సెట్ లను రూపొందించారు. ప్రముఖ వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్, బాహుబలి ఫేమ్ శ్రీనివాస్ మోహన్, హాలీవుడ్ దిగ్గజ యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి పని చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: