జూనియర్ ఎన్టీఆర్ఈ పేరు చెబితే అభిమానుల్లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. నందమూరి వారసుడు గా, తాతకు తగ్గ మనవడిగా నందమూరి నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ తన అద్భుతమైన నటన కౌశలంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించారు.సినిమాలలో హీరోగా నటించిన తొలినాళ్లలో బొద్దుగా, ముద్దుగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ వన్, ఆది వంటి సినిమాలలో భారీ ఆహార్యంతో కనిపించారు.ఆ తర్వాత క్రమంగా బరువు తగ్గి స్లిమ్ గా మారిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఫిట్నెస్ కు కేరాఫ్ అడ్రస్ గా మారారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫిట్నెస్ ప్రస్తుతం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అసలు ఎన్టీఆర్ ఫిట్ నెస్ సీక్రెట్ ఏంటి? ఎన్టీఆర్ తన ఫిజిక్ మారకుండా ప్రతి రోజు ఏం చేస్తున్నారు? అని తెలుసుకోవాలి అనుకునే వారి కోసమే జూనియర్ ఎన్టీఆర్ ఫిట్నెస్ మంత్ర.జూనియర్ ఎన్టీఆర్ తన బాడీని చాలా పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నారు. బరువు తగ్గడానికి ఎంతో కష్టపడిన తారక్, బరువు తగ్గిన తర్వాత మళ్లీ పెరగకుండా ఉండడం పైన కూడా అంతే దృష్టి సారించారు. జూనియర్ ఎన్టీఆర్ వెయిట్ తగ్గినప్పటి నుంచి ఒకటే డైట్ ఫాలో అవుతున్నాడని ఆ కారణంగానే ఆయన ఫిజికల్ ఫిట్నెస్ లో ఏ మాత్రం మార్పు రాలేదని సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

అసలు ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ ప్రతి రోజు ఏం చేస్తున్నారు? ఏం తింటున్నారు అంటే..ప్రతిరోజు జూనియర్ ఎన్టీఆర్ ఉదయం లేవగానే యోగా గాని వర్కౌట్ గాని రెండు గంటలపాటు చేస్తారని చెప్తున్నారు. ఆ తర్వాత ఉదయం రెండు గ్లాసుల రాగి జావా తాగుతారట. ఆపైన నానబెట్టిన బాదం పప్పు వంటి డ్రై ఫ్రూట్స్ తీసుకుంటారని సమాచారం. ఆ తర్వాత రెండు ఉడకబెట్టిన కోడి గుడ్లను తింటారట.ఆపై ఫ్రూట్ జ్యూస్ ల తోనే తారక్ ఎక్కువగా గడిపేస్తారట. ఇక మధ్యాహ్న భోజనంలో కూడా కార్బోహైడ్రేట్ కంటెంట్ తక్కువగా ఉండేలా రాగి సంకటి, నాటుకోడి తింటారట. రాత్రిపూట నానబెట్టిన మొలకలు వచ్చిన తృణధాన్యాలు తప్ప మరేమి తినరట. ఇక రోజంతా మధ్యలో ఎప్పుడు ఆకలిగా అనిపించినా కేవలం ఫ్రూట్ జ్యూస్ లతోనే కడుపు నింపుకుంటారు అని సమాచారం.ఆయిల్ ఎక్కువగా ఉండే ఆహారాలు, డీప్ ఫ్రై చేసే ఆహారాలు తారక్ అస్సలు ముట్టుకోరని సమాచారం. అంత కఠినంగా డైట్, ఎక్సర్సైజులు చేస్తూ ఉన్నారు కాబట్టే తారక్ అంత ఫిట్ గా ఉన్నారని ఇండస్ట్రీలో టాక్. మరి మీరు కూడా జూనియర్ ఎన్టీఆర్ లా ఫిట్ గా మారాలంటే వ్యాయామం చెయ్యండి. డైట్ ప్లాన్ మార్చుకోండి.ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2షూటింగ్ లో బిజీ గా వున్నారు. అలాగే దేవర 2 కూడా చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: