Rx-100 చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి కుర్రాళ్ళ గుండెల్లో సెగల పుట్టించిన పాయల్ రాజ్పుత్ గురించి చెప్పాల్సిన పనిలేదు.. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో తన అందచందాలతో అలరించిన సరైన సక్సెస్ అందుకోలేక పోయింది. మళ్లీ మంగళవారం సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న పాయల్ కెరియర్ పరంగా ఇప్పుడు మరొకసారి పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నది. ఏకంగా ఆరు భాషలలో వెంకటలచ్చిమి అనే చిత్రంతో రాబోతున్నది.


రాజా, ఎన్ఎస్ చౌదరి నిర్మాతలుగా ఈ చిత్రాన్ని డైరెక్టర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ముని మాట్లాడుతూ ఈ సినిమా కథ రాసుకున్నప్పుడే పాయల్ అయితే సరిగ్గా సరిపోతుందనుకున్నాము అందుకే ఆమెతో పాన్ ఇండియా సినిమా చేస్తున్నామని తెలుగులో పాటు సుమారుగా ఆరు భాషలలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామంటు తెలియజేశారు. ఈ సినిమా ట్రైబల్ గర్ల్ యాక్షన్ రివెంజ్ స్టోరీతో కూడి ఉంటుంది అంటూ తెలియజేశారు. ఈ సినిమా కచ్చితంగా ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తుంది అంటూ తెలియజేశారు డైరెక్టర్ ముని.


హీరోయిన్ పాయల్ మాట్లాడుతూ.. మంగళవారం సినిమా తర్వాత తన వద్దకు చాలా కథలు వచ్చాయని వాటన్నిటిని విన్నాను కానీ నచ్చలేక వదిలేసానని.. అయితే డైరెక్టర్ ముని చెప్పిన ఈ వెంకటలచ్చిమి  సినిమా కథ చాలా నచ్చిందని ఈ సినిమా తర్వాత తన పేరు కూడా వెంకటలచ్చిమిగా మారిపోతుందేమో అన్నంతగా సబ్జెక్టు ఉందంటూ తెలియజేసింది. తన కెరియర్ లో నెక్స్ట్ లెవెల్ కి వెళ్లడానికి ఈ పాన్ ఇండియా మూవీ సరిపోతుందని నమ్మకం తనలో కలిగి ఉందని తెలిపారు. ఇప్పటికే తన గ్లామర్ తో బోల్డ్ సినిమాలతో యూత్ ని బాగా ఆకట్టుకున్న పాయల్ ఈసారి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ అవుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: