టాలీవుడ్ లో ఉన్న అగ్రనిర్మాణ సంస్థల మీద నిర్మాతల మీద‌ గత మూడు రోజులుగా జరుగుతున్న ఆదాయపు పన్ను శాఖ దాడులు ఈరోజుతో 4 రోజులో అడుగుపెట్టాయి .. నిర్మాత దిల్‌ రాజును ఇంటి నుంచి ఆఫీసుకు తీసుకువెళ్లారు అంటే .. దాడులు దాదాపు కంప్లీట్ అయినట్టే .. ఆయన ఆఫీసుకు తీసుకువెళ్లి ఎలాంటి డాక్యుమెంట్లు దొరికాయి .. ఏం దొరికాయి అన్నది ఓ స్టేట్మెంట్ తయారు చేసి సంతకాలు తీసుకుని ఈ రైడ్స్‌ ని అక్కడితో కంప్లీట్ చేస్తారు .. ప్రతి రైడ్ లో జరిగే పద్ధతి .. దీని కారణంగానే ఈరోజుతో ఈ రైడ్స్‌ ముగుస్తాయని అంతా అనుకోవచ్చు. అయితే ఇప్పుడు రకరకాల గాసిప్లు, అందులో ఎన్నో దొరికాయి.. ఎంతో బ్లాక్ మానీ దొరికింది .. ఇలా అలా అంటూ రకరకాల వార్తలు బయటకు వచ్చేస్తున్నాయి .. వాస్తవానికి పెద్ద పెద్ద సంస్థలు అన్ని అకౌంట్ ల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటారు ..


ఎక్కడ లోటు లేకుండా డాక్యుమెంట్స్ అన్ని పకడ్బందీగా మెయింటైన్ చేసుకుంటారు .. మరి ముఖ్యంగా జిఎస్టి , టిడిఎస్ అనేవి కీలకంగా మారిన తర్వాత ఎక్కడ నిర్లక్ష్యం చెయ్యట్లేదు .. దీని కారణంగా పెద్ద సమస్య ఉంటుంది అని అనుకోవాల్సిన పనిలేదు. పుష్ప 2, సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ చేంజర్ సినిమాలు రిలీజ్ కు ముందు వెనక వార్తల్లోకి వచ్చిన పెద్దపెద్ద అంకులే కాస్త సమస్య కావచ్చు .. పలు ఈవెంట్ల మీద చెప్పిన పనికిరాని పెద్దపెద్ద కబుర్లు కూడా ఇందులో సమస్య కావచ్చు .. పాటలకు అంత ఖర్చు చేసాం .. ఇంత ఖర్చు చేసాం అన్ని కోట్ల పెట్టి భారీ సెట్లు వేశాం అన్నది కూడా వీటిలో ప్రభావం చూపించింది .. అందుకే ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్ ను కూడా పిలిపించుకొని మరి ప్రశ్నించారని కూడా ఇన్సైడ్ వర్గాల ద్వారా తెలుస్తుంది.


అలాగే పుష్ప 2 ఫంక్షన్లో యాంకర్ సుమ నోటి నుంచి పదేపదే 1000 కోట్ల మార్కెట్ అని మార్కెట్ అని  చెప్పించింది అల్లు అర్జున్ టీం .. అయితే అది నిర్మాతలకు అలా చెప్పటం ఇష్టం లేదు .. అయినా కూడా పదేపదే దాన్నే చెప్పించారు. అది కూడా పీకల మీదకు వచ్చింది. ఇవన్నీ ఇలా ఉంచితే ఊహించని ఓ గాసిప్ వైరల్ గా మారింది. నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఈ ఐటీ దాడిలో గట్టిగా దొరికిపోయారని .. 90 కోట్ల వరకు నగదు ట్రాన్సాక్షన్లకు సమాధానం చెప్పాల్సి ఉందనే టాక్ కూడా బయటకు వచ్చింది .. వైట్ ను బ్లాక్ ను వైట్ చేసే వ్యవహారం గట్టిగా జరిగిందని అందుకే ఇప్పుడు ఇలాంటి ఇబ్బందులు వచ్చాయని కూడా అన్నారు . అదేవిధంగా ఫారిన్‌ నుంచి వచ్చిన ఫండ్స్ మీద ఫోకస్  పెట్టారు. అదేవిధంగా ఐటీ అధికారులు పలు నిర్మాణ సంస్థల్లోని అకౌంట్ సిబ్బందిని ఎంతో కఠినంగా ప్రశ్నించి వారి దగ్గర్నుంచి కుండ బద్దలయ్యే నిజాలు కూడా రాబట్టారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: