ఇక ఈ సంక్రాంతి తెలుగు చిత్ర పరిశ్రమ కు ఎంతో స్పెషల్ అంటున్నారు సినీ విశ్లేషకులు .. ఎంత పెద్ద సీజన్ అయినా రిలీజ్ అయిన అన్ని సినిమాలు భారీ కలెక్షన్లు సాధించడం అనేది కష్టం .. కానీ ఈ సంక్రాంతి మాత్రం ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది .. రిలీజ్ అయిన అన్ని సినిమాలు బిగ్ నెంబర్స్ ను రికార్డ్ చేసి టాలీవుడ్ కు కొత్త జోష్ ఇచ్చింది . ముందుగా రామ్ చరణ్ గేమ్ చేంజర్ తో వెండి తెరపై.  సంక్రాంతి కి యుద్ధం మొదలుపెట్టాడు .. జనవరి 10 న రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తో మొదలైన .. కలెక్షన్ల పరంగా గట్టి సత్తా చాటింది ..


తొలిరోజే రూ. 186 కోట్ల మార్కును టచ్ చేసింది .. ఇక దీంతో సంక్రాంతి బోణి బాగుందని అంతా ఫుల్ ఖుషి అయ్యారు. ఇక ఈ పండగ యుద్ధంలో రెండో వీరుడుగా ఎంట్రీ ఇచ్చిన బాలయ్య డాకు మహారాజ్ .. దర్శకుడు బాబీ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెర్కక్కించిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది .. అలాగే బాలయ్య గ‌త‌ సినిమాల తో పోలిస్తే బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచిన డాకు మహారాజ్ .. నాలుగు రోజుల్లోనే రూ . 100 కోట్ల మార్కులు దాటేసింది.


సంక్రాంతి వార్ లో లేటుగా వచ్చిన .. లేటెస్ట్ గా రికార్డులు క్రియేట్ చేసిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం .. అవుట్ అండ్ డౌట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెర్కక్కిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ మూడు రోజుల్లోనే రూ. 100 కోట్ల మార్కును దాటేసింది. ఇలా టాలీవుడ్ లో ఈ సంక్రాంతికి వచ్చిన ఈ మూడు సినిమాలు కూడా డబల్ డిజిట్ కలెక్షన్స్ ను అందుకొని తెలుగులో రాబోయే సినిమాలకు మరింత ఓపిని ఇచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: