గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, ఈ సంక్రాంతికి డాకు మహారాజ్ చిత్రంతో మరో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు.ఇదిలావుండగా ‘డాకు మహారాజ్’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలైంది. తాజాగా ఈ సక్సెస్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు.బాలకృష్ణ ఇప్పుడు 'డాకు మహారాజ్' సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే ఈ మూవీని థియేటర్లలో చూసిన నందమూరి అభిమానులు బాలయ్య నెక్స్ట్ మూవీపై దృష్టి పెట్టారు.ఈ క్రమంలో నే బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్న బాలయ్య వరుస హిట్స్ తో జోరు మీద ఉన్నారు. ఇదే జోష్ తో ఆయన వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. త్వరలోనే బాలయ్య నెక్స్ట్ మూవీని మొదలు పెట్టబోతున్నారు. అయితే ఇప్పటికే బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాల్లో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయనున్న ప్రాజెక్ట్ కూడా ఒకటి. బాలయ్య కెరీర్లో 111వ సినిమాగా తెరకెక్కబోతున్న ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే మొదలు పెట్టారు డైరెక్టర్ గోపిచంద్.

అలాగే గోపీచంద్ తో పాటు బాలయ్య నెక్స్ట్ ఓ తమిళ సినిమాలో నటిస్తున్నాడని టాక్ నడుస్తోంది. కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న 'జైలర్ 2' అనౌన్స్మెంట్ తర్వాత, ఇందులో బాలయ్య ఓ కీలక పాత్ర పోషించబోతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఇదిలావుండగా నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న 'అఖండ 2' షూటింగ్ త్వరలోనే మొదలు కాబోతోంది. కంటిన్యూగా నాలుగు సినిమాలతో 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి రికార్డును క్రియేట్ చేసిన బాలయ్య అతి త్వరలోనే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు.ఇక తాజాగా డాకు మహారాజ్‌తో బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు బాబీ కూడా మరోసారి బాలయ్యతో అదిరిపోయే సినిమా చేస్తానని ప్రకటించాడు. ఈ సారి బాలయ్యతో డాకు మహారాజ్‌ని మించి పాన్ ఇండియా భాషలలో గొప్ప చిత్రం చేస్తానని మాట ఇస్తున్నాను అని ప్రకటించాడు బాబీ. ఇలా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీ అయ్యేందుకు సిద్ధంగా వున్నారు బాలయ్య. ఇక ప్రస్తుతం డాకుమహారాజ్ మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: