సాధారణంగా సినీ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడం చాలా అరుదు అనే టాక్ వినిపిస్తూ ఉంటుంది. అలా ఇప్పటికే ఐశ్వర్య రాజేష్ ,అంజలి, కావ్య కళ్యాణ్ రామ్,వైష్ణవి చైతన్య వంటి హీరోయిన్స్  వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే టాలెంట్ ఉంటే చాలు అవకాశాలు వస్తాయని నిరూపించారు. తాజాగా ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు తమ ఫిట్నెస్ ని పెంచుకోవడానికి జిమ్ములో ఒక హీరోయిన్ తెగ కష్టపడుతోంది. ఈ అమ్మడికి సంబంధించి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.


ఇక హీరోయిన్ ఎవరో కాదు బేబీ సినిమాతో భారీ క్రేజీ సంపాదించుకున్న వైష్ణవి చైతన్య.. మొదట యూట్యూబ్లో పలు రకాల షార్ట్ ఫిలింలో నటించి క్రేజీ సంపాదించుకున్న వైష్ణవి చైతన్య సాఫ్ట్ వేర్ డెవలప్ అనే వెబ్ సిరీస్ తో భారీ క్రేజ్ అందుకుంది.. అలా పలు చిత్రాలలో చిన్న చిన్న పాత్రలలో నటించిన ఈ అమ్మడు బేబీ సినిమాతో ఓవర్ నైట్ కి స్టార్ స్టేటస్ ని సంపాదించుకుంది. యూత్ కి ఈ సినిమా బాగా నచ్చడంతో బారి హిట్ అందుకుంది. సోషల్ మీడియాలో కూడా భారీ క్రేజ్ అందుకున్నది.



వైష్ణవి చైతన్య నటనకు మంచి గుర్తింపు రావడంతో వరుస సినిమాలలో అవకాశాలను అందుకుంటోంది. ప్రస్తుతం సిద్దు జోన్నలగడ్డతో కలిసి ఒక సినిమాలో నటిస్తోంది. తాజాగా జిమ్ ట్రైనర్ తో కలిసి జిమ్ములో కసరత్తులు చేస్తూ.. వయ్యా రంగ అందాలను చూపిస్తూ కుర్రాళ్ల మతి పోగొట్టేలా చేస్తోంది. అలాగే జిమ్ ట్రైనర్ తో కలిసి కూడా ఒక సెల్ఫీ ఫోటోని షేర్ దిగిన ఒక ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానుల సైతం ఆశ్చర్యపోతున్నారు.తెలుగు అమ్మాయి జిమ్ములో కసరత్తులు సూపర్ అంటూ మరికొంతమంది నేటిజెన్సు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ దుస్తులలో ఏమైనా గుర్తుపట్టడం కాస్త కష్టంగా ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: